తెలంగాణ ఆర్టిస్టుల కొత్త పండుగ (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొత్త పండుగ పేర తెలంగాణ కళాకారుల వేదిక పెయింటింగ్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. తెలంగాణ కళాకారుల వేదికకు చెందిన 140 మంది చిత్రకారుల పెయింటింగ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తున్నారు.

పెయింటింగ్ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లో గల స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది.

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వేదిక కన్వీనర్ రమణా రెడ్డి క్యురేట్ చేశాడు. కాన్వాస్‌పై ఎక్రీలిక్స్, వాటర్ కలర్స్, మిక్స్‌డ్ మీడియా పెయింటింగ్స్ ప్రదర్శనకు పెట్టారు. ఈ ప్రదర్శన ప్రతి రోజూ ఉదయం గం.10.30 ని.ల నుంచి నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

పెయింటింగ్ ప్రదర్శన

పెయింటింగ్ ప్రదర్శన

స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటైన పెయింటింగ్ ప్రదర్శనను వీక్షిస్తున్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

పెయింటింగ్ ప్రదర్సన

పెయింటింగ్ ప్రదర్సన

తెలంగాణ కళాకారుల వేదిక ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శనను తెలంగాణ విద్యామంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించి, ఆ తర్వాత చిత్రాలను చూశారు.

పెయింటింగ్ ప్రదర్శన ప్రారంభం

పెయింటింగ్ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాదులోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ కళాకారుల చిత్రప్రదర్శనను జగదీశ్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ప్రదర్శనను తిలకిస్తున్న అల్లం నారాయణ

ప్రదర్శనను తిలకిస్తున్న అల్లం నారాయణ

తెలంగాణ కళాకారుల వేదిక ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శనకు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లం నారాయణ చిత్రాలను వీక్షిస్తూ ఇలా....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+