తలలో బాణంతో 240కిలోమీటర్లు ప్రయాణించాడు

భోపాల్: ఓ వైపు తలలో బాణం.. మరో వైపు ఆపరేషన్‌ కోసం 240 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అంబులెన్స్‌లో మూడు జిల్లాలు దాటించిన బంధువులు ఓ ఆస్పత్రిలో అతనికి ఆపరేషన్‌ చేయించారు. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ ప్రాణాలు నిలిచాయి.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో ప్రకాశ్ కుటుంబంతో విభేదాలున్న పొరుగింట్లో ఉండే అర్జున్ కుటుంబసభ్యులు బాణాలతో దాడి చేశారు. ఓ బాణం ప్రకాశ్ తలలో గుచ్చుకుంది. తీవ్రంగా రక్తస్రావం జరిగింది.

Shocking! Tribal travels 240 km with arrow in head

దీంతో వెంటనే బాణం గుచ్చుకున్న ప్రకాశ్‌ను బంధువులు అంబులెన్స్‌లో 240కిలోమీటర్లు ప్రయాణించి ధార్, బడ్వానీ, ఖర్‌గోన్ జిల్లాలు దాటి ఇండోర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

దాదాపు మెదడును చేరిన బాణం మొనను గంటపాటు శస్త్రచికిత్స చేసి వైద్యులు తొలగించారు. మధ్యప్రదేశ్‌లోని గిరిజనులైన భిల్లులు.. గొడవలైన ప్రతిసారీ బాణాలతో దాడులు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+