బిజెపికి పోటీ: గోరక్షణ కోసం ముస్లీం ఎమ్మెల్యే ప్రచారం
లక్నో: భారతీయ జనతా పార్టీకి సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే జమీరుల్లా ఖాన్ షాకిచ్చారు! అవులను రక్షించుకోవాలని బిజెపి ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా, ఎస్పీ ఎమ్మెల్యే జమీరుల్లా 'సేవ్ కౌ' ప్రచారాన్ని ప్రారంభించారు.
పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం అమల్లో ఉంది. దానిపై ప్రత్యేకించి ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ముస్లిం వ్యక్తి, అదీ ఎమ్మెల్యే గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేపట్టడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జమీరుల్లా ఖాన్ ఆవులను వధించడం తప్పు అని చెబుతున్నారు. అందుకోసం ఆయన మతగురువుల, నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులు తమ సోదరులని, వారు గోవులను పూజిస్తారని చెప్పారు. అందుకే వారి సెంటిమెంట్లను గౌరవించాలన్నారు. గోవధ విషయమై తాను ఖురాన్ ప్రవచన కర్తలతో చర్చకు సిద్ధమేనన్నారు.
గోవధ చేయాలని, తప్పనిసరిగా గొడ్డు మాంసం తినాలని అందులో ఏమీ లేదన్నారు. అదే సమయంలో పలువుతి గోవు వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. తద్వారా తమ హిందూ సోదరులకు మద్దతివ్వాలని భావిస్తున్నారు.
మత గురువులు, నేతలతో శుక్రవారం నాడు తొలిసారి ఆవులను రక్షించుదామని ప్రమాణం చేయించేందుకు సిద్ధం చేస్తున్నారు. కాగా, జమీరుల్లా ఖాన్ అలీగర్ లోని కోల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications