అద్భుత చిత్ర వర్ణన (పిక్చర్స్)
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, రచయిత శివాజీ తల్లావజ్జుల.. జి సత్య శ్రీనివాస్ చిత్రాలను వర్ణిస్తూ తన కవితను వివరించారిలా..

తారా జైశ్వాల్
చిట్టడవి మనిషి అడవులు భూమికే కాదు,
సత్య శ్రీనివాస్ కూ ఊపిరితిత్తులే !
మరి అడవి గాలి పీల్చే వాడికి
కవిత మనసులో మొలకెత్తడంలో
ఆశ్చర్యం లేదు కదా !

చిత్ర కవిత
అటవీ సంరక్షణ పరిధిలోని పనిలో ఉన్నవాడికి ఆదివాసి,
గిరిజన మిత్రులు హితులూ పుష్కళంగా ఉండడంలోనూ సందేహం లేదు.
అందుకే శ్రీనివాస్ ని అడవి తల్లులూ, తోబుట్టువులూ.
అన్నదమ్ములను , తల్లిదండ్రులనూ మించిన
వారయ్యారు.

ముప్పనేని నాగరత్నమ్మ
వాళ్ళ మాటల వెనుక ,బాధ వెనుక, ముచ్చట్ల వెనుకా కనిపించని కధలూ,
కవితలూ, అతన్ని ఆవాహన చేసుకున్నాయి కదా.
అడవిలో అట్టుడికి పోయే ప్రతి శోధన వెనుక వున్న పదార్ధ
పరమార్ధాలు తరచి చూసి తూకం వేసి వున్నవాడాయే.

బి. ఆది లక్ష్మి
ప్రభుత్వానికి, ప్రభుత్వేతర సంస్థలకూ పని చేసి, కొంతకాలంగా సొంతగా
పని తెచ్చుకుని సొంతశ్రమలో పడ్డాడు.

చిత్ర కవిత
పంచవటి లాంటి ఇళ్ళు, అందులో పుస్తకాలు, సంగీత సరదాలూ,
అటవీ పనుల చాయా చిత్రాలూ, అతన్ని కమ్ముకుని
అల్లుకున్న" శిశిర- మాధవీ లత "లూ, కంప్యూటర్ సరంజామా,
,అతని తల్లి గారు గుర్తుగా ఉంచిన వీణ,.... ఇట్టి విశేషాల
మధ్య కాగితాలూ కలం పుచ్చుకుని "చిట్టి" పొట్టి కవితలు పుట్టిస్తుంటాడు.

కొండపల్లి కోటేశ్వరమ్మ
పర్యావరణ పుస్తకాలూ, ప్రింటవుట్లూ, ఫేస్ బుక్కూ ( చార్మినార్
చౌరస్తా మరియు మోండా మార్కెట్ స్థలముల సంగమం కదూ!)
అను నిత్యావసర అతి వ్యక్త పదార్ధం లోనూ మంచి మంచి సంగీతం వింటూ
ఉర్దూ గజల్అర్ధాలు వెతుకుతూ మిత్ర సంభాషణ చేయటం అతని నిత్య విశేషాలు.
వయోలిన్ వదిలేసినట్టు ఫోటోగ్రఫీని , చిత్ర కళనీ వదిలి పెట్టలేదతను.సాధన
సాగుతోంది.

చిత్ర కవిత
అడవి కైనా , మనకైనా మూలం తల్లి కదా--
అందుకని గతంలో అప్పుడప్పుడూ అటవీ పర్యావరణ ఉద్యమాల్లో కిందా మీదా అవస్థలు పడి,
వాహకులైన స్త్రీల ముఖ చిత్రాలు గీసాడు.
వాటర్ కలర్సూ అప్పుడు మొదలు పెట్టిన ముఖ చిత్ర వచన కవిత్వంతో పాటు యిదిగో
నిన్న మొన్న ప్రదర్శన దాకా వచ్చాడు సత్య.

మామిడి అనంత లక్ష్మి
సొంతవారూ, పరాయి వారూ అన్న తేడా లేకుండాఅన్నం పెట్టిన తల్లులు.,
పాటలూ,ఆటలూ నేర్పిన తల్లులూ, అడవి తల్లి కధలు పాడిన తల్లులూ......
యిలా తల్లులెందరినో కొద్ది రంగుల్లో చక్కగా చిత్ర్హించాడు.
నగరంలో ఒకనాటి వనం లాంటి తన ఇల్లు వరస మారి, రూపు మారి
"గోయిధే జెంత్రం "- అయి కూచున్న చోట ఈ చిత్రాల ప్రదర్సన చేసాడు.
ఇందరి తల్లులను చూడటానికని
వారి సంతతి, మిత్రులు, బంధు కుటుంబ పెద్దలు,జర్నలిస్టులూ-
ఇతర ఇష్టులు వచ్చి పలకరించుకున్నారు.
పలు మార్లు స్మరించుకున్నారు.
ఆ సంస్మరణలో శ్రీనివాస్ తల్లి,
ఆమె చుట్టూ ఇతర తల్లులూ ఒకనాటి సంస్కార వాసనల తీరు
తనవి తీరా అంతా మాట్లాడుకున్నారు.

పామర్తి రాజ్యమ్మ
పర్యావరణం, అడవుల భద్రత గురించీ వాటి గురించీ విస్పష్టమైన,
సొంతమైన ఎన్నో ఆలోచనలు, కధనాలూ ,
సేవా మార్గాలూ కలవాడు కనుక శ్రీనివాస్ రచనలన్నీ చిక్కటి పరిశోధనాంశాలు.
ఇక త్వరలో అచ్చు కానున్న ప్రతి చిన్న పద్యం ఒక వన కావ్యం.
-కొన్ని పదాలే అయినా కాని హైకూని ప్రతిద్వనిస్తాయి.
కొన్ని మాటలే సమస్త మహారణ్యాలనీ ప్రతిబింబిస్తాయి.
ఈ పదాల వెనుక మధ్య గిరిజన పద ధ్వని,
జిడేల ‘ పిలుపు, గట్టు మాటున చీమ పుట్టలో పెట్టిన తెల్లని గుడ్లు,
సన్నటి నీటి అలలు, గట్టుని పలకరించిన తాకిడి,
విడిచిన గిరిజన బాణం- అన్నీ ఎన్నెన్నో మన చుట్టూ ముసురుకుంటాయి.
శ్రీనివాస్ ని వినండి, శ్రీనివాస్ ని చదవండి.
శ్రీనివాస్ చిత్రించిన ముఖ చిత్రాల్లో తిరగండి.
-శివాజీ . తల్లావజ్జుల.












Click it and Unblock the Notifications