బాబుకు 'సత్తా' గుబులు

డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్లు కాంగ్రెస్-ఎంఐఎంలకు అనుకూలంగా జరిగినా ముఖాముఖీ పోటీ ఉంటే తమ పార్టీ బాగా పుంజుకుంటుందని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టిన సర్వేలో లోక్ సత్తా కొన్నిచోట్ల గండికొట్టే అవకాశం ఉందని తేలిందని అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోట్ల ఈ ప్రభావం కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్-మజ్లిస్ కూటమికి గ్రేటర్‌లో మెజారిటీ డివిజన్లు దక్కే అవకాశాలున్నాయని, టీడీపీకి గౌరవప్రదమైన స్కోరు దక్కుతుందని సర్వేకర్తలు పార్టీ అధినేతకు చెప్పినట్టు తెలిసింది.
ఏ డివిజన్ లో ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ఆ ప్రభావాలను అధిగమించడానికి చేయాల్సిన యత్నాలపైనా దృష్టి సారించారు. ఇప్పటికే కొన్నిచోట్ల లోక్ సత్తా, పీఆర్పీ నేతలను పార్టీలోకి ఆహ్వానించిన బాబు మరికొన్ని చోట్లా అదే పని చేయడం ద్వారా ఆ పార్టీల ప్రభావాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా సర్వే ద్వారా చేపట్టారు.












Click it and Unblock the Notifications