తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పడి లేచేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తెలుగు సినీ రంగంలో తిరుగులేని నటుడిగా చెలామణి అయిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తప్పటుడుగులు వేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఏడాది అవుతోంది. ఒక రకంగా ఒక పార్టీకి ఏడాది కాలం చాలా తక్కువ. కానీ చిరంజీవి ఇమేజ్ కు అది ఎక్కువ. పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి పార్టీకి తిరుగు ఉండదని చాలా మంది భావించారు. అయితే లోకసభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అతని రాజకీయ ప్రభ వెలవెలబోతూ వచ్చింది. లోకసభలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయాడు. శాసననసభకు మాత్రం 18 సీట్లు సాధించారు. పాలకొల్లు ఓటమి చిరంజీవికి మరింత ఎదురు దెబ్బ. తిరుపతిలో మాత్రం బొటాబోటీగా గెలుపొంది పరువు కాపాడుకున్నారు.

ఆ తర్వాత కూడా పార్టీని ఆయన బలోపేతం చేస్తారనే విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. పార్టీ నిర్ణయాల్లో ఏ మాత్రం తమ ప్రమేయం లేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే తప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ పెట్టడానికి వెనకా, ముందు మద్దతు తెలిపిన మిత్రా, పరకాల ప్రభాకర్, శివశంకర్ వంటి నేతలు, రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం వంటి నాయకులు పార్టీ నుంచి తప్పుకున్నారు. చిరంజీవి కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దాని వల్ల పార్టీని బలోపేతం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. చిరంజీవి రాజకీయ వ్యవహార శైలి అందుకు అనుగుణంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసి, దానికి ప్రాణం పోయడానికి చిరంజీవి నడుం కట్టినట్లుగా భావిస్తున్నారు. టెక్కలి ఉప ఎన్నికను ఆయన దీనికి పునాదిగా తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన టెక్కలికి చాలా ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించారు. శాసనసభా సమావేశాలను వదిలేసి టెక్కలి ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగారు. ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో ఇప్పుడే చెప్పలేం. పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X