కెసిఆర్ ఆటలు సాగుతాయా?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించడంలో ఇప్పటి వరకు కెసిఆర్ ను మించిన నాయకుడు లేడనే పేరు ఆయనకు ఉంది. కానీ ఆయన చిత్తశుద్ధిపై అవిశ్వాసం పెరిగిపోతోంది. ఆయన ఎన్నికల్లో టికెట్లు కేటాయించిన తీరుపైనే విపరీతంగా విమర్సలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఆయన ఎంపిక చేసుకున్న సీట్ల తీరు, అభ్యర్థుల ఖరారు తీవ్ర అనుమానాలకు తావిచ్చాయి. ఆయనపై తీవ్ర అనుమానాలు కూడా పొడసూపాయి. సికింద్రాబాద్ టికెట్టును కెసిఆర్ కు డబ్బులిచ్చి తెచ్చుకున్నానని వెంకట రెడ్డి అనే నాయకుడు చెప్పిన తర్వాత ఆయన అటువంటి చర్యలకు ఎన్నింటికి పాల్పడ్డాడో అనుమానాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నిర్వహిస్తున్న పార్టీ సమీక్ష సమావేశాలు కూడా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.
పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన కెసిఆర్ అక్కడికి నాయకులను పిలిపించుకుంటున్నారు. ఉద్యమ కమిటీలు, రాష్ట్ర కమిటీ, క్రమశిక్షణ కమిటీ వంటిని ఏర్పాటు చేయడానికి ఆయన ముఖ్య నాయకులను ఢిల్లీకి ఆహ్వానించారు. నాయని నర్సింహారెడ్డి, విజయరామారావు, నిరంజన్ రెడ్డి వంటి కొంత మంది నేతలు ఢిల్లీకి బయలుదేరారు.












Click it and Unblock the Notifications