వైయస్ జగన్ దెబ్బ ఎవరిపై?

YS Jagan
వైయస్ జగన్ కొత్త ప్రాంతీయ పార్టీ వల్ల రాష్ట్రంలో ఏ పార్టీ పూర్తిగా దెబ్బ తింటుందనే విశ్లేషనలు సాగుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి వైయస్ జగన్ గుబులు పట్టుకుంది. పార్టీ నాయకుల్లో తీవ్ర నిరాశ అలుముకున్న నేపథ్యంలో వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టడానికి ముందుకు రావడంతో ప్రజారాజ్యం పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్ జగన్ వల్ల కాంగ్రెసు పార్టీకి జరిగే నష్టం కన్నా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలకే ఎక్కువ నష్టం జరుగుతుందనే అంచనాలు ముందుకు వస్తున్నాయి. రెండు పర్యాయాలు అధికారానికి దూరం కావడం, తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం సన్నగిల్లడం వంటి కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలోని జిల్లా నాయకులు, కార్యకర్తులు వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు సమాచారం. దీన్ని ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొంచెం ముందుగానే కళ్లు తెరిచారు. పార్టీలో యువతను ముందుకు తెచ్చేందుకు ఆయన ఓ ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. అరవై ఏళ్ల వయసు పైబడిన నాయకులకు రిటైర్ మెంట్ ప్రకటించి, యువకులను ప్రోత్సహించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో యువతకు ఆయన రాజకీయ తరగతులు నిర్వహిస్తున్నారు.

మొత్తంగా, కదలిక లేని ప్రజారాజ్యం పార్టీకే వైయస్ జగన్ నుంచి ఎక్కువ ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉన్నదీ లేదు, పోయేదీ లేదు అనే నిర్లిప్తత స్థితికి చిరంజీవి చేరుకుంటే చెప్పలేం గానీ ఇప్పుడున్న స్థితిలోనైనా భవిష్యత్తులో పార్టీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ జగన్ శిబిరంలో ప్రస్తుతానికి చాలా మంది కాంగ్రెసు నాయకులే ముందు వరసలో కనిపిస్తున్నారు. ఆయన ఒకసారి పార్టీని ప్రకటించిన తర్వాత దాని రూపురేఖలు, విధివిధానాలు చూసిన తర్వాత, మున్సిపల్ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత ప్రజారాజ్యం పార్టీకి చెందిన జిల్లా నాయకులు క్యూ కట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకున్న చిరంజీవి సీమాంధ్రలో కూడా తన ప్రాబల్యాన్ని చాటలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. తెలంగాణ ప్రాంతానికి ఆయన పూర్తిగా దూరమైనట్లే. ఈ స్థితిలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా వైయస్ జగన్ ఈ ప్రాంతంలో కూడా పాగా వేయాలని అనుకుంటున్నారు. దీంతో చిరంజీవి ఎటూ కాకుండా పోయే ప్రమాదం నెలకొని ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ప్రాంతీయ పార్టీలున్నాయి. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉన్నాయి. తెరాసను మిగతా ప్రాంతీయ పార్టీలతో జమ కట్టలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమమే ఆ పార్టీని నిలబెడుతుంది. వైయస్ జగన్ పార్టీతో తెలుగుదేశ, ప్రజారాజ్యం పోటీ పడాల్సి వస్తుంది. అయితే, రాష్ట్రంలో తమిళనాడు పరిస్థితి వస్తుందని, వైయస్ జగన్ పార్టీ తమ పార్టీ మాత్రమే ఉంటాయని, కాంగ్రెసు మట్టి కొట్టుకుపోతుందని తెలుగుదేశం నాయకులు ఆశ పడుతున్నారు. కానీ కాంగ్రెసు పార్టీ అంత బలహీనంగా లేదనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు గుర్తించాల్సి ఉంటుంది. ఏదో మేరకు తెలుగుదేశం పార్టీని కూడా వైయస్ జగన్ పార్టీ దెబ్బ తీస్తుందని చెప్పవచ్చు. అదే సమయంలో పూర్తిగా బలం కోల్పోయిన స్థితిలోనైనా చిరంజీవి కాంగ్రెసుతో జత కట్టే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+