తెలంగాణకు అసదుద్దీన్ ఓవైసీ కొలికి

తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం వైఖరులను బట్టి తమ వైఖరి మారదని ఆయన అన్నారు. తెలంగాణపై రాష్టంలోని నాలుగు పార్టీలు తమ వైఖరిని వెల్లడించాల్సి ఉందని, కాంగ్రెసు నిర్ణయం కోసం తెలుగుదేశం, మజ్లీస్ ఎదురు చూస్తున్నాయని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో అసదుద్దీన్ మాటలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తాము కాంగ్రెసు వైఖరిని బట్టి మారబోమని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా గానీ కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఓ నిర్ణయానికి వచ్చినా అసదుద్దీన్ వైఖరి పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉంది. మజ్లీస్ వైఖరిని అడ్డు పెట్టి తెలంగాణపై నాన్చుడు ధోరణిని అవలంబించడానికి కాంగ్రెసు అధిష్టానానికి అవకాశం లభిస్తుంది. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానంపై మాత్రం తెలంగాణ విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది.












Click it and Unblock the Notifications