తెలంగాణపై తేల్చే దాకా చేతులెత్తేయడమే

తెలంగాణపై పార్టీ వైఖరి వెల్లడయ్యే వరకు పార్టీని అదుపు చేయడం సాధ్యం కాదని ఆయన పార్టీ అధిష్టానానికి నివేదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ నాయకులను తప్పు పట్టే పరిస్థితి లేదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తున్నారని ఆయన నివేదించినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు రెచ్చిపోతారని ఆయన అన్నారు. ఇలాంటి స్థితిలో సాధ్యమైనంత త్వరగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించడమే మంచిదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ వైఖరికి కట్టుబడేవాళ్లు పార్టీలో ఉంటారు. నచ్చనివారు వెళ్లిపోతారని, అప్పుడే పార్టీ గాడిలో పడుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
నారా చంద్రబాబునాయుడి రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలుగుదేశం పార్టీ అటు సీమాంధ్రకు, ఇటు తెలంగాణకు కాకుండా పోయిందని ఆయన అధిష్టానికి పంపిన నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు తెలుగుదేశం తెలంగాణ నేతలూ అటు సీమాంధ్ర నేతలు కాంగ్రెసు పార్టీనే విమర్సిస్తున్నారని, కాంగ్రెసులో మాదిరిగా ఇరు ప్రాంతాల తెలుగుదేశం నాయకులు పరస్పరం దూషించుకోవడం లేదని, కాంగ్రెసు అధికారంలో ఉండడం వల్లనే ఇది సాధ్యమవుతోందని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశం కూడా పోతుందని, దానివల్ల ఆ పార్టీ మరింత దెబ్బ తింటుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications