పోటీపై చిరంజీవి డైలామా!

Chiranjeevi
త్వరలో జరగనున్న కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అనే డైలామాలో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత నిస్తామని ప్రకటించిన చిరంజీవి అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలుపొందడానికి తాను ఉప ఎన్నికల పోటీనుండి తప్పుకొని చేయూత నిస్తారా అనేది ఇప్పుడు పలువురిని తొలుస్తున్న ప్రశ్న. జగన్ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో ఆయన్ను ఓడించాలంటే కాంగ్రెస్‌కు తమ పార్టీ నేతలు పాటు చిరంజీవి సాయం ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చిరంజీవి పోటీనుండి తప్పుకొని మద్దతునిస్తారా అనేదే చూడాల్సి ఉంటుంది.

కడప లోక్‌సభకు జరిగిన గత సాధారణ ఎన్నికల ద్వారా పీఆర్పీ మంచి ఓటుబ్యాంకును అక్కడ కలిగి ఉందని నిరూపించింది. ఆ ఓటుబ్యాంకును కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. చిరు మద్దతిస్తే జగన్‌ను ఓడించటం కాంగ్రెస్‌కు కష్టమేమీ కాదని పలువురు భావిస్తున్నారు. మద్దతు ఇవ్వకుండా ఉపఎన్నికల బరిలో పీఆర్పీ నిలిస్తే మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బందే. అయితే రాజ్యసభ ఎన్నికల్లో సుహృద్భావంతో చిరు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే దారిలో వెళ్లే అవకాశం ఉండవచ్చు.

పార్టీకి భారీగా ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ గెలిచే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికే చిరు ప్రధాన్యత ఇస్తారని తెలుస్తోంది. మళ్లీ మళ్లీ ఎన్నికలకు పోయి ప్రజలను ఇబ్బందులలోకి నెట్టే ఉద్దేశ్యం తనకు లేదని అందుకే ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మద్దతు ఇస్తానని చెబుతూనే, ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం తీవ్రస్థాయిలో ఆందోళన తెలుపుతానని చిరంజీవి అంటున్నారు. అంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆయన కాంగ్రెస్‌కు మద్దతు పలకవచ్చని పలువురు భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వడం ద్వారా తమ పార్టీ భవిష్యత్తు ప్రయోజనాలు కూడా చిరంజీ్వి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలిసినప్పటికీ భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి నష్టం కాకుంటా ఉండే దిశలో ఆలోచిస్తారు. ఇటు కాంగ్రెస్ కూడా జగన్‌తో పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గెలుపుకు కావాల్సిన ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పీఆర్పీతో పొత్తుకు ప్రయత్నాలు చేయవచ్చు. అవసరమైతే అధిష్టానం సహాయంతో చిరుతో పొత్తుకు సిద్ధపడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+