వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కిరణ్‌ది వైయస్ ఫార్ములానే

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
తెలంగాణపై ప్రస్తుత ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఫార్ములానే అనుసరిస్తున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనేది ఆ ఫార్ములా. తన ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో చెప్పిన మాట అదే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదనేది ఆయన ఆమె వద్ద చేసిన వాదన. ఉద్యోగుల సహాయ నికారణ సాగుతున్నా, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికక్కడ ఆందోళనలు సాగుతుంటే, సొంత కాంగ్రెసు పార్టీవారే ఆందోళనలకు సహకరిస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి సంతృప్తికరంగా ఉందని ఆయన విన్నవించుకున్నారు. చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించిన సమగ్ర చిత్రాన్ని సోనియా ముందు ఆవిష్కరించారు. ఒక సీడీ, ఒక సవివరమైన నివేదికను అందించి మౌఖికంగానూ ఆమెకు పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తన ప్రభుత్వ 'ప్రోగ్రెస్ రిపోర్ట్'ను సోనియా గాంధీ ముందు ఉంచారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారనేందుకు 'రచ్చబండ' కార్యక్రమం విజయవంతం కావడమే నిదర్శనమని ఆయన చెప్పారు. అభివృద్ధిపై ఉద్యమ ప్రభావం పడలేదని తెలిపేందుకు ఇటీవల రాష్ట్రానికి రూ.25వేల కోట్ల పెట్టుబడులు రావడమే రుజువని ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అతి కొద్దిమంది, అదీ ఉద్దేశపూర్వకంగా మాత్రమే అంతరాయం కలిగించారని చెప్పారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకు చేయూత అందిస్తున్నామన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన కనపడిందని, లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయని సోనియాకు వివరించారు. సమస్యలను పరిష్కరించి, ప్రజలకు న్యాయం చేస్తామని అధిష్ఠానానికి హామీ ఇచ్చారు.

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, వాటికి అందిస్తున్న ప్రోత్సాహకాలను గణాంకాలు, చిత్రాలతో సహా వివరించారు. తెలంగాణ ప్రాంతంలో మహీంద్రా అండ్ మహీంద్రకు చెందిన కొత్త ప్రాజెక్టు వస్తోందని, ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. చిత్తూరులోనూ ఒక భారీ ప్రాజెక్టు వస్తోందన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలపైనా సోనియాతో ముఖ్యమంత్రి చర్చించారు. కడప, పులివెందులలో పార్టీకి ఉన్న సానుకూలతలు, ప్రతికూలతలపై విశ్లేషించారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి వాదనలను సోనియా నమ్ముతారా అనేది చెప్పలేం. అప్పటికే ఆమె రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలు తెప్పించుకున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం.

English summary
CM Kiran Kumar Reddy is following YSR formula on Telangana issue. This is evident from CM's arguments at Congress president Sonia Gandhi. He informed Sonia that people are wanting development to statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X