• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌తో కాంగ్రెసుకు కష్టకాలం

By Srinivas
|

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై కడప ఎంపీగా అభ్యర్థిని ఎంపిక చేయడానికి కాంగ్రెసు పార్టీ మల్లగుల్లాలు పడింది. మొదట ఎవరినో అనుకొని ఆ తర్వాత ఎవరినో ఇతర పార్టీనుండి తీసుకు వచ్చి పోటీ చేయించాలని చూసి ఆ తర్వాత చిట్ట చివరకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైపు మొగ్గింది. జగన్‌పై అభ్యర్థిని నిలబెట్టడానికి అభ్యర్థులు చాలామంది సిద్ధంగా ఉన్నారన్న తులసీరెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం కనిపించడం లేదు. నోటిఫికేషన్‌కు, దరఖాస్తుకు సమయం ఉన్నప్పటికీ కాంగ్రెసు పార్టీకి అభ్యర్థి మాత్రం అంత వీజీగా దొరకలేదు. ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబానికి జిల్లాలో ఉన్న బలం, తండ్రి మరణం తదితర సెంటిమెంటు అంశాలు జగన్‌కు కలిసి వచ్చే అంశాలు. ఆ కారణంగానే జగన్‌పై పోటీకి ఎవరూ సిద్ధపడటం లేదు.

మొదట ఎవరినో అనుకొని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బలమైన అభ్యర్థిని తమవైపు లాక్కొని ప్రయత్నాలు జగన్‌పై పోటీకి సిద్ధపడినప్పటికీ వారు వెనక్కి తగ్గారు. చివరకు చేసేది లేక జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఎట్టకేలకు జగన్‌పై పోటీకి సై అన్నారు. మరో విషయం ఏమంటే మిగిలిన వారితో జగన్ పోటీ మాట అటుంచింతే నిత్యం జగన్‌ను టార్గెట్ చేసిన డిఎల్‌తో పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కడప బరిలో ఎవరూ దొరకక చివరకు డిఎల్ దిగినప్పటికీ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జగన్ చిన్నాన్న వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి లేకుంటే కాంగ్రెసు పరిస్థితి దారుణంగా ఉండేది. అసలు పులివెందులనుండి పోటీ కూడా చేసేది కాదు. వైయస్ వివేకా పోటీ చేయకుంటే పార్టీ క్యాండిడేట్‌ను నిలవపవద్దనుకున్న వాదనలు కూడా వినిపించాయి. అయితే వైయస్ కుటుంబం వ్యక్తి అయిన వివేకా ముందుకు రావడంతో అభ్యర్థిని వెదికే బాధ తప్పింది.

అయితే ఇప్పుడు పార్టీ అభ్యర్థుల కోసం ఇంతలా అపసోపాలు పడుతున్న కాంగ్రెసు పార్టీ గెలుపుపై నమ్మకంతో మాత్రం లేదు. రెండు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని, ఒక్కసీటు గెలిచినా చాలని, అదీ కాకుంటే మెజారిటీ తగ్గించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు మానసికంగా జగన్‌పై పోరులో తమకు అపజయం ఖాయమనే భావనకు వచ్చాయి. అందుకే పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఎన్నికలు రిఫరెండం కాదంటే, కడప బరిలో దిగుతున్న డిఎల్ గెలుపుపై నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నారు. గెలుపుపై నమ్మకం ఉన్న ఒకే ఒక వ్యక్తి వైయస్ వివేకానందరెడ్డి. అదీ కేవలం తన గెలుపు మాత్రం ఖాయమని ఆయన భావన. అదీ స్థానికులతో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఆయన భావిస్తున్నారు.

జగన్‌కు జీవన్మరణ సమస్య అయినప్పటికీ కాంగ్రెసుకు మాత్రం తమ పార్టీ ప్రతిష్టకు సవాల్. అయితే ముందుగానే జగన్‌పై అప్రమత్తమయి ఉంటే తమ ప్రతిష్టను ఇంతగా ఫణంగా పెట్టవలసి వచ్చేది కాదేమో. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఓదార్పును అడ్డం పెట్టుకొని కాంగ్రెసులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయనపై వేటు వేయాల్సిందేనని చెప్పిన వారి కొందరు పెద్దల మాటలు వినక పోయి ఉంటే ఈ ప్రతిష్టకు పోయే అవసరం రాక పోయి ఉండేదని పలువురు నేతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అలా కాక పోయినా జగన్ బయటకు వెళ్లినప్పుడైనా ఆయనకు మద్దతు తెలిపిన వారిపై వెంట వెంటనే చర్యలు తీసుకొని ఉన్నా ఈ పరిస్థితి తలెత్తేది కాదనే వారు భావిస్తున్నారు. మొత్తానికి జగన్‌ను బుజ్జగించడంలో గానీ, ఆయన వర్గంపై వేటు వేయడంలోగానీ నిర్లక్ష్యం చేయడం వల్ల కాంగ్రెసు ప్రతిష్ట మసకబారిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు భావిస్తున్నారు. మొత్తానికి జగన్ పార్టీలోనుండి బయటకు పోయినప్పుడు అందరూ తక్కువగా అంచనాలు వేసినట్లుగా భావిస్తున్నారు. అయితే గత స్థానిక శాసనమండలి ఎన్నికలలో తన వర్గం వారిని గెలుపించుకొని తన సత్తా చాటాడు.

English summary
Congress party is casing crisis with Ex MP YS jaganmohan Reddy in Kadapa district. Crisis is it's self goal, thinking some leaders. Some leaders of Congress gave wrong information to High Command about YS Jagan and his Odarpu, thinking leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X