సోనియాపై వైయస్ జగన్ దాడి తగ్గిందా?

తనపై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసుకు దగ్గర కావాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అందువల్లనే సోనియాపై విమర్శల జోరు తగ్గించారని అంటున్నారు. సాధారణంగా, ప్రతిపక్షాల నాయకులు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ, జగన్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆయన తన కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఎడతెరిపి లేని విమర్శనాస్త్తాలు సంధిస్తున్నారు.
జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తులో వేగం మందగించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కు కావడం వల్లనే అలా జరుగుతోందని వారంటున్నారు. అయితే, జగన్ మాత్రం తాను కాంగ్రెసుకు శత్రువును కాదలుచుకోలేదనే సంకేతాలను ఇవ్వడానికే సోనియాపై విమర్శలు చేయడం లేదని అంటున్నారు. అయితే, జగన్ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని అంటున్నారు. విశాఖపట్నంలో జరిగిన కాంగ్రెసు ఉత్తరాంధ్ర గర్జన సభలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, శాసనసభ్యుడు చిరంజీవి వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ప్రత్యర్థిగా పరిగణించడానికే కాంగ్రెసు రాష్ట్ర నాయకులు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications