డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్?

డిఎల్ రవీంద్రా రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అధిష్టానం రవీంద్రా రెడ్డిని ఆదేశించే అవకాశం ఉంది. పదవుల కోసం ఢిల్లీకి కొంత మంది నాయకులు సూట్‌కేసులు మోస్తున్నారని, తన పద్ధతి అది కాదని డిఎల్ అన్నారు. డిఎల్ వ్యాఖ్యలకు సంబంధించిన సిడిలను, వార్తాపత్రికల క్లిప్పింగులను కొంత మంది పార్టీ నాయకులు అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై డిఎల్ రవీంద్రా రెడ్డి ప్రతి రోజూ విమర్శలు చేస్తున్నారు. తిరుపతిలో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కడప జిల్లా పార్టీ నాయకుల సమావేశానికి తాను రాబోనని చెబుతూ ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పైగా, కడపకు రావడానికి ముఖ్యమంత్రి భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications