కాంగ్రెసు రాజకీయాలతో చిరు ఉక్కిరిబిక్కిరి

Chiranjeevi
కాంగ్రెసు రాజకీయాల రుచి మెగాస్టార్ చిరంజీవికి తెలుస్తున్నట్లే ఉంది. కాంగ్రెసులోని గ్రూపు రాజకీయాలను ఎప్పుడు ఎవరిని స్థితికి నెడుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెసులో, ముఖ్యంగా రాజకీయాల్లో ఏదీ సూటిగా ఉండదనే విషయం ఆయనకు అనుభవంలోకి వస్తున్నట్లే ఉంది. పార్టీ అధిష్టాన అండదండలు ఉంటే చాలు, ఏదైనా జరిగిపోతుందని, అధిష్టానం హామీ ఇస్తే అమలైపోతుందని ఆయన ఇంత కాలం నమ్ముతూ వచ్చినట్లు అర్థమవుతోంది. అయితే, కాంగ్రెసులోని రాజకీయాలు పరిస్థితులను తారుమారు చేస్తాయని, అధికార వైరుధ్యాలు తీవ్రమై జాతకాలను మారుస్తాయని ఆయనకు బహుశా తెలిసి వస్తూ ఉండవచ్చు. తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇప్పించాలని చిరంజీవి చేసిన ప్రయత్నం బెడిసికొడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పైగా, కాంగ్రెసులో చిరంజీవికి ప్రత్యర్థులు పెరుగుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు ఢిల్లీలో మకాం వేసి, రామచంద్రయ్య మంత్రి అవకాశాలను దెబ్బ తీయడానికి చెమటోడుస్తున్నారు. మరోవైపు, చిరంజీవిని రాష్ట్రంలో మంత్రి పదవికి పరిమితం చేసే ప్రయత్నాలకు కూడా పూనుకున్నారు. కేంద్రంలో చిరంజీవికి మంత్రి పదవి, రామచంద్రయ్యకు రాష్ట్రంలో మంత్రి పదవి దక్కాల్సి ఉంది. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వకుండా, చిరంజీవికి ఇస్తే రాష్ట్రంలో పార్టీకి మేలు జరుగుతుందని కడప జిల్లా నాయకులు వాదిస్తున్నారు. చిరంజీవిని కేంద్రంలో మంత్రివర్గంలోకి తీసుకుంటే దానివల్ల ఖాళీ అయ్యే తిరుపతి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కష్టమని వారు పార్టీ అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు.

దానికితోడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు ఒక రకంగా చిరంజీవికి దిమ్మ తిరిగే పరిస్థితే ఉంది. ఇంత కాలం బలహీనంగా కనిపించిన కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా జూలు విదిలించినట్లే కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆధిపత్య రాజకీయాలకు ఆయన విరుగుడు కనిపెట్టినట్లే ఉన్నారు. కడప జిల్లా నాయకులు ఓ వైపు చిరంజీవి ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఒక్కసారిగా దర్శకనిర్మాత, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన లేఖ చిరంజీవికి అశనిపాతంలా మారింది. తాను ఎవరికీ లేఖ రాయలేదని దాసరి నారాయణ రావు చెబుతున్నప్పటికీ ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు.

చిరంజీవి కేంద్రంలోకి వెళ్తే, తన రాజ్యసభ సీటుకు ఎసరు వస్తుందని దాసరి నారాయణ రావు భావిస్తున్నారు. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి దాసరి నారాయణరావును దగ్గరు చేసుకుని చిరంజీవిని దెబ్బ తీసే ప్రయత్నాలు సాగిస్తున్నారని, అందులో భాగంగానే దాసరి నారాయణ రావు లేఖ ఉదంతం చోటు చేసుకుందని అంటున్నారు. చిరంజీవిని రాష్ట్రంలో మంత్రి పదవికి పరిమితం చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఆయన నుంచి పోటీని నివారించుకోవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద, చిరంజీవికి కాంగ్రెసు రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నట్లే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+