వైయస్ జగన్‌కు తొలిసారి అసలైన సవాల్

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఓ విధంగా జగన్ భవితవ్యం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మనుగడకు కొవ్వూరు పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. కొవ్వూరుతో పాటు తెలంగాణ ప్రాంతంలోని మరో ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఆరు నియోజకవర్గాల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కొవ్వూరు మాత్రం అలా కాదు. గతంలో జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కడప, పులివెందుల నుండి పోటీ చేసి భారీ ఆధిక్యతతో గెలిచారు. అయితే ముప్పయ్యేళ్లుగా పులివెందుల, కడప నియోజకవర్గాలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సొంత నియోజకవర్గాలుగా మారాయి. అందులోనూ జగన్ అప్పుడే పార్టీని వీడటం, వైయస్సార్ దుర్మరణ సానుభూతి కలిసి వచ్చింది. ఇవన్నింటి కారణంగా అక్కడ వారికి భారీ మెజార్టీ వచ్చింది. కానీ కొవ్వూరు అలా కాదు.

రాజకీయ పార్టీలు అన్నప్పుడు గెలుపోటములు సహజం. కానీ కొవ్వూరు మాత్రం టిడిపి, కాంగ్రెసు మరీ ముఖ్యంగా జగన్‌కు ప్రతిష్టాత్మకం. జగన్ పార్టీ స్థాపించిన తర్వాత తన కుటుంబంతో ఏమాత్రం సంబంధం లేని, ప్రభావం లేని కొవ్వూరులో ఉపపోరు బరిలో నిలిచారు. ఇక్కడి జగన్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి పాతకాపే. అయితే పార్టీ రంగు మారిపోయింది. టిడిపి నుండి జగన్ పార్టీలో చేరి ఉప పోరు బరిలోకి ప్రసన్న దిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టి పథకాలు, జగన్ పైనున్న అభిమానం, తనకు స్థానికంగా ఉన్న ఇమేజ్ తనకు గెలుపు మాత్రమే కాదు భారీ మెజార్టీని ఇస్తుందని నల్లపురెడ్డి ధీమాతో ఉన్నారు. తమ ప్రభావం ఉన్న కడప, పులివెందులను మినహాయిస్తే తాను పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి జగన్ ఎదుర్కోబోతున్న రాజకీయ వేదిక కొవ్వూరు. ఇక్కడ ఆయన దెబ్బతింటే విపక్షాలకు అవకాశం దొరకడమే కాకుండా రాష్ట్రంలో ఆయన ప్రభావం కూడా క్రమంగా తగ్గుతుందనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళతాయి.

ఇప్పటికే ఆయన ఎదుర్కొంటున్న సిబిఐ దర్యాఫ్తు కారణంగా ప్రజల్లో ఆయన ఇమేజ్ మసకబారిందని కాంగ్రెసు, టిడిపిలు అంటున్నాయి. కొవ్వూరు చేజారితే కేసులు ఎదుర్కొంటున్నందున జగన్‌ను ప్రజలు నమ్మటం లేదనే విపక్షాల వాదనలకు బలం చేకూరుతుందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 2009 ఎన్నికల్లో అది తెలుగుదేశం పార్టీ సీటు. కాబట్టి సిట్టింగ్ సీటు కోల్పోతే అది ఆ పార్టీకి తీవ్ర నష్టమే చేస్తుంది. ఇక టిడిపిలో ఇన్నాళ్లూ ఉన్న నల్లపురెడ్డి ఇప్పుడు జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దృష్ట్యా టిడిపి ఓట్లు భారీగా చీలే అవకాశముంది. ఇలాంటి సమయంలో అధికార పార్టీ అక్కడ తన బలం నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+