చిరంజీవి సెకండ్ రోల్, మూడో పవర్ సెంటర్ అయ్యారా?

Chiranjeevi
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు నేత చిరంజీవి రాజకీయాల్లో సెకండ్ హీరో పాత్రకే పరిమితమవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాను అనుకున్న ముఖ్యమంత్రి పదవి ఇప్పుడప్పుడే తనను వరించేలా లేదని తెలుసుకున్న చిరంజీవి ఇక సెకండ్ హీరో పాత్రకు పరిమితమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. అభిమానుల కోరికో లేక తన లక్ష్యమో ఏమైనా 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. తన ఇమేజ్ భారీ ఓటింగ్ తన పార్టీకి తెచ్చి పెట్టినప్పటికీ ఆ ఆశలు మాత్రం నెరవేరలేదు. తన లక్ష్యాన్ని చేరుకునే ఉద్దేశ్యంలో భాగంగా చిరంజీవి దాదాపు మూడేళ్ల తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ముఖ్యమంత్రి పదవిని టార్గెట్‌గా పెట్టుకునే ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే అంతకన్నా ముందే పీఠం కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఆ పీఠంపై కన్నేసిన బొత్స సత్యనారాయణ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వినిపించింది. తన పార్టీని విలీనం చేసినందుకు, అవిశ్వాసం సమయంలో ప్రభుత్వాన్ని కాపాడినందుకు చిరంజీవికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆయనను కేంద్రానికి తీసుకు వెళ్లేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

ఇక అప్పటి నుండి ఇప్పుడప్పుడే పీఠంపై గురి పెట్టడం సరికాదని భావించి, మొదట పార్టీలో నిలదొక్కుకునేందుకు ఆయన సెకండ్ హీరో పాత్ర పోషిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి వస్తే పార్టీలో మూడో సెంటర్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఎదురు కాలేదు. చిరంజీవి మూడో సెంటర్ అయిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఇటీవలి వరకు ఆయన పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వర్గంలో ఉన్నారని, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో చేరిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. బొత్స, కిరణ్‌ ఇద్దరూ చిరంజీవి ఇమేజ్ ద్వారా తాము లబ్ధి పొందాలని చూస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అధిష్టానం ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవిని మచ్చిక చేసుకుంటూనే వచ్చే ఎన్నికల సమయంలోనూ ఆయనను అక్కడికే పరిమితం చేసి ఆయన ద్వారా లబ్ది పొందాలని వారిద్దరూ చూస్తున్నారని అంటున్నారు. అలా అయితే ఆయన సెకండ్ రోల్‌కే పరిమితమయినట్లవుతుందని అంటున్నారు. అయితే చిరంజీవి కూడా తన లక్ష్యం కోసం దగ్గరి దారి వెతుక్కుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేంద్రానికి వెళ్లడం ద్వారా అధిష్టానాన్ని తన వైపుకు మళ్లించుకోవడం, రాష్ట్రంలో అందరి నేతల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి తాను తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశలో అడుగులు వేస్తున్నారని మరికొందరు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+