రామోజీరావుని మళ్లీ టార్గెట్ చేసిన జగన్ సాక్షి

Sakshi Logo
ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మరోసారి టార్గెట్ చేసింది. ఆయన రూ.1,177 కోట్ల భారీ జరిమానా కట్టనప్పటికీ ఆదాయపన్ను శాఖ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనం రాసింది. ఇతర కేసుల్లో యమ స్పీడుగా వెళుతున్న అధికారులు రామోజీ రావు జరిమానా విషయంలో మాత్రం వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారని పేర్కొంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో చట్టాలను ఉల్లంఘించి నగదు రూపంలో డబ్బులు సేకరించారని, సెక్షన్ 269 ఎస్ఎస్ ప్రకారం ఇది చట్టరీత్యా నేరమని, ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి నగదు రూపంలో డిపాజిట్లు సేకరించిన పక్షంలో, సేకరించిన మొత్తానికి సరిపడా మొత్తాన్ని చట్టంలోని సెక్షన్ 271-డి ప్రకారం జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ చట్ట ఉల్లంఘనను పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ 2006లో బయట పెట్టారని తెలిపింది. 2008లో మార్గదర్శి అక్రమాలు పూర్తిగా బయటకు వచ్చాయని, దీనిని సీరియస్‌గా తీసుకున్న ఐటి శాఖ విచారణ జరిపిందని, మార్గదర్శి ఉద్యోగుల్ని ప్రశ్నించిందని, నగదును బ్యాంకుల్లో డిడిలుగా మార్చడం నిజమని తెలుసుకున్న ఐటి అందుకు సరిపడా మొత్తాన్ని పన్నుగా చెల్లించాలని నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.

అయితే ఆ తర్వాత తమకు చట్టాలు వర్తించవంటూ రామోజీ రావు హైకోర్టులో ఐదు రిట్ పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొంది. అంతేకాకుండా అప్పట్లో ఆదాయపన్ను శాఖ 16వ రేంజ్ అదనపు కమిషనర్‌గా ఉన్న ఆర్.వి.రెడ్డిపై వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేసిందని, అధికారిపై ఆరోపణలు చేసినందుకు హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడిందని తెలిపారు. సదరు అధికారిని ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని తప్పు పట్టారు. దీంతో రామోజీ తరఫు న్యాయవాదులు 2008లో ఐదు పిటిషన్లు వెనక్కి తీసుకొని కొత్తవి దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారని పేర్కొంది. తొలి పిటిషన్లు ఉపసంహరించుకొని రామోజీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారని, తమకు అధికారులు పేర్కొన్న చట్టాలు వర్తించవని కోర్టులో వాదించారని, తదుపరి ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరారని, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు దీనిపై స్టే ఇచ్చిందని తెలిపింది. అయితే ఐటి శాఖ మాత్రం స్టే ఎత్తివేతకు అంతగా ప్రయత్నాలు చేయలేదని పేర్కొంది. 2009లో తూతూ మంత్రంగా మాత్రమే స్టే వెకేట్ పిటిషన్ వేసిందని, ఆ తర్వాత రామోజీకి పన్ను విధించదిన అధికారిపై బదలీ వేటు పడిందని పేర్కొంది. కేసు విచారించాల్సిన అవసరాన్ని అధికారులు హైకోర్టుకు చెప్పక పోవడమే కాకుండా, సుప్రీంకు వెళ్లే వెసులుబాటును ఉన్న ఉపయోగించుకోలేదని పేర్కొంది. నాలుగేళ్లుగా రామోజీ కోర్టు స్టేతో నెట్టుకొస్తున్నారని పేర్కోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+