వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరచాలనాలు, ఆలింగనాలు అంటూ సాక్షి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించమని చెప్పడంపై కాంగ్రెసు పార్టీలో హర్షం వ్యక్తమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక రాసింది. ఫిక్సింగ్ గుట్టు బాహాటంగా రట్టయిందని, అవిశ్వాసం ముప్పును తప్పించుకున్న ఆనందాన్ని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఎంత ప్రయత్నించినా దాచుకోలేకపోయాయని, ఇంతకాలం తెరవెనుక, గుంబనంగా, గప్‌చుప్‌గా సాగుతూ వస్తున్న కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కు తాజాగా అసెంబ్లీ సాక్షిగా బహిరంగమైందని రాసింది.

తెరాస అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వారాదని టిడిపి తీసుకున్న నిర్ణయం తాలుకు ఊరట ప్రతిపక్ష, ప్రధాన ప్రతిపక్షాల్లో కనిపించిందని, బాబు ప్రకటన నేపథ్యంలో బుధవారం శాసనసభ లోపలా, ఆవరణలోనూ కాంగ్రెసు, టిడిపి నేతల కోలాహలం, ఉత్సాహం కనిపించిందని, వారంతా సంతోషకర వాతారవరణంలో, చలోక్తులతో గడిపారని, ముఖాలు చిరునవ్వులతో వెలిగాయని రాసింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని చందమామ చేతిలో పెట్టారని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దానిని ప్రస్తావించింది. అంతేకాకుండా... గవర్నర్ ప్రసంగం అనంతరం తనకు ఎదురైన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారని, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆయనతో కరచాలనం చేశారని, అంతటితో ఊరుకోకుండా ధన్యవాదాలు తెలిపారని రాసింది.

బుధవారం జెసి దివాకర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు తమ మేనమామ అని, సహజంగా తల్లి చనిపోతూ తన బిడ్డలను మేనమామ చేతుల్లో పెట్టి వారి ఆలనా పాలనా చూసుకోవాలంటూ అప్పగింతలు పెడుతుందని, అదే విధంగా వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల బాగోగులను చంద్రబాబుకు అప్పగించారని అన్నారు.

అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని అన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత జెసి టిడిఎల్పీ కార్యాలయం వద్ద టిడిపి నేతలతో మాట్లాడారు.

English summary
The Congress senior MLA JC Diwakar Reddy has sais that the Telugudesam party president Nara Chandrababu Naidu will protect the Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X