ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు రూర‌ల్ యోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

నెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రంలో ప‌ట్ట‌ణ‌-గ్రామీణ ప్రాంతాల క‌ల‌యికే నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. 2009 నియోజ‌క వ‌ర్గా ల పున‌ర్విభ‌జ‌న వ‌ర‌కు ప్ర‌ధానం రాపూరు నియోజ‌క‌వ‌ర్గం గా ఉన్న ప్రాంతం నెల్లూరు రూర‌ల్ గా మారింది. రాపూ రు నుండి 21 గ్రామాలు..టౌన్ ప‌రిధిలోని ప‌లు డివిజ‌న్లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఆనం కుటంబానికి పెట్ట‌ని కోట లాంటి రాపూ రు నియోజ‌క‌వ‌ర్గం 2009లో ర‌ద్ద‌యి...నెల్లూరు రూర‌ల్ ఏర్పాటైంది.

రాపూరు నుండి నెల్లూరు రూర‌ల్ లో ఎన్నిక‌లు...
1952 లో ఏర్పాటైన రాపూరు నియోజ‌క‌వ‌ర్గం నుండి నేటి నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కు మొత్తంగా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొమ్మిది సార్లు కాంగ్రెస్ గెల‌వ‌గా..మూడు సార్లు టిడిపి గెలుచుకుంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్ధి ఒక‌సారి గెలుపొందారు. ఇక‌, వైసిపి 2014 లో ఈ స్థానం నుండి గెలిచింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం లో 2009 లో పీఆర్పీ అభ్య‌ర్ధి పై కాంగ్రెస్ గెల‌వ‌గా..2014 ఎన్నిక‌ల్లో బిజెపి అభ్య‌ర్ధి పై వైసిపి గెలిచింది. రాపూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆనం కుటుంబం ప్రాతినిధ్యం వ‌హించింది. ఆనం మూడు సార్లు గెలిస్తే, ఒక సారి నెల్లూరు లో, ఒక‌సారి ఆత్మ‌కూరు లో గెలిచారు. ఆనం రామ‌నారాయ‌ణ‌., వివేకానంద రెడ్డి సొంత అన్న త‌మ్ముళ్లు. వ‌రుస‌గా మూడు సార్లు ఒకే చ‌ట్ట స‌భ‌లో వీరు స‌భ్యులుగా ఉండ‌టం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌.

#AndhraPradeshElections2019: All about Nellore Rural Constituency

2014 ఎన్నిక‌ల్లో ఓట్లు..ఫ‌లితాలు..
నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం 261570 ఓట్లు ఉండ‌గా, 158406 ఓట్లు పోల‌య్యాయి. అందులో వైసిపి అభ్య‌ర్ది కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డికి 79103 ఓట్లు రాగా, ప్ర‌త్య‌ర్ధి బిజెపి అభ్య‌ర్ధి అయిన సురేష్ రెడ్డికి 53,450 ఓట్లు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసిపి అభ్య‌ర్ది కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి 25,653 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. అప్ప‌టి వ‌ర కు కాంగ్రెస్ లో ఉన్న కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఆ త‌రువాత జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌యి వైసిపి లో చేరారు. 2014 లో అనూహ్యంగా సీటు ద‌క్కించుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వినూత్న నిర‌స‌న‌లు..క్రికెట్ బెట్టింగ్ ఆరోప‌ణ‌లు..
కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నారు.
అసెంబ్లీలో బ‌ల‌మైన వాయిస్ గా నిలిచారు. ఇక‌, నెల్లూరు లో స్థానిక స‌మ‌స్య‌ల పై అధికారుల‌ను నిల‌దీయ‌టంలో కోటంరెడ్డి వినూత్న నిర‌స‌న‌ల‌కు వెనుకాడ‌లేదు. మురుగు నీటిలో దిగి అధికారులు వ‌చ్చే వ‌ర‌కూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ నే ఉన్నారు. ఇంటి స్థ‌లాలు..అభివృద్ది విష‌యంలో అధికారుల పై ఒత్తిడి తేవ‌టం.. నిత్యం ప్ర‌జ‌ల‌తో మమేకం అవ్వ టం కోటంరెడ్డి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌రానే ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆరోప‌ణ‌లు శ్రీధ‌ర్ రెడ్డిపై ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+