హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యుటి డిమాండ్: హైద్రాబాద్‌కు ప్రాధాన్యం వెనుక!?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఐటిఐఆర్ భారీ కేటాయింపులు జరపడంతో కేంద్రం హైదరాబాదు విషయంలో ఏ దిశలో వెళ్తుందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఉద్యమాల నేపథ్యంలో ఐటిఐఆర్ హైదరాబాదుకు కేటాయింపులు జరపడం చూస్తుంటే కేంద్రపాలిత ప్రాంతం వైపు అడుగులు వేస్తోందా అనే చర్చ సాగుతోంది. హైదరాబాద్‌కు భారీ ప్రాజెక్టు ప్రకటించడం, మరిన్ని ప్రాజెక్టులు డంప్ చేయాలనే ప్రతిపాదనలు వంటివి... రాజధాని నగరం 'భవిష్యత్ హోదా'తో ముడిపడినవే అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం, చండీగఢ్ తరహా యుటి, ఢిల్లీ తరహా యుటి వంటి అనేక ప్రతిపాదనల నేపథ్యంలో... హైదరాబాద్‌ను పారిశ్రామికంగా, మౌలికంగా పరిపుష్టం చేసే చర్యలు తీసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 2008లో ఐటిఐఆర్‌లపై ఒక విధానాన్ని రూపొందించింది. సెజ్‌ల ఏర్పాటుపై మంచి ఊపుమీదున్న అప్పటి ప్రభుత్వం ఐటిఐఆర్‌నూ ఒక చూపు చూడాలని అనుకుంది.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటిఐఆర్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అంటే గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర ఐటిఐఆర్‌కు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఇది జరిగిన ఏడాదికి(రెండు రోజుల క్రితం) తుది ఆమోదముద్ర వేసింది.

అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైందని, హైదరాబాద్‌ను వదులుకోమని, విభజన అనివార్యమైతే యుటిగా చేయాలని సీమాంద్రులు వాదిస్తున్న సమయంలోనే మరోసారి హైదరాబాదుకు పెద్దపీట వేయడం చర్చకు దారి తీసింది. విభజన నిర్ణయంపై సీమాంద్రులకు సర్దిచెప్పాలన్నా, హైదరాబాద్‌పై మమకారాన్ని తగ్గించాలనుకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతానికి వరాలు ప్రకటించడం రాజకీయంగా తెలివైన నిర్ణయం అవుతుంది.

కానీ, కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటంటున్నారు. హైదరాబాద్ విషయంలో కేంద్రం ఏదో మతలబుతోనే వ్యవహరిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఐటిఐఆర్ కేటాయింపులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ ప్రకాశ్ నారాయణ తదితరులు ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణపై నిర్ణయం ప్రకటించాక జిహెచ్ఎంసి పరిధులను విస్తరించడం గమనార్హం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హైదరాబాద్ నగర, శివార్ల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

English summary
The Cabinet Committee on Economic Affairs has 
 
 approved the setting up of Information Technology 
 
 Investment Region (ITIR) near Hyderabad at an 
 
 investment of around Rs 2.19 lakh crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X