మారిన చంద్రబాబు శైలి: లంచ్ లేక్‌వ్యూలోనే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పనితీరును మార్చేసుకున్నారు. హడావిడి, హంగామా లేకుండా నింపాదిగా పనిచేసుకుంటూ పోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుస సమీక్షలతో అధికారులు గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితికి స్వస్తి పలికి పరిమితంగా లోతుగా సమీక్షలు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నిరంతరం వార్తల్లో ఉండేవారు. తాను పరుగులు తీస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నట్లు ఉండేవారు.
గతంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ఊపిరి సలపనన్ని సమీక్షలు పెడుతుండేవారు. వీటి కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్ద సంఖ్యలో అధికారులు పడిగాపులు కాస్తుండేవారు. కానీ, ఈసారి చంద్రబాబుతన శైలిని వ్యూహాత్మకంగానే పూర్తిగా మార్చేసుకున్నట్లు కనిపిస్తున్నారు.
కొత్త రాష్ట్రం అనేక సమస్యల మధ్య ఏర్పాటు కావడం, ఆర్థికంగా ఉన్న లోటుకు తోడు హామీల విషయంలో ప్రజల అంచనాలను అందుకోవాల్సి ఉండటంతో ఆయన ముందుగా వ్యవస్ధలను చక్కదిద్దడంపై దృష్టి పెడుతున్నారు. తన ప్రాధాన్యాలను ఎంచుకొని అందులో ఫలితాలను రాబట్టడంపై కసరత్తు చేస్తున్నారు. ఆదాయం వచ్చే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి భారీగా రుణాలు సేకరించి రైతు రుణ మాఫీకి చెల్లించడంపై ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. బయటకు పెద్దగా కనిపించకుండానే ఈ కసరత్తు నడుస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంకు ఉన్నతాధికార బృందంతో శుక్రవారం ఇక్కడ చంద్రబాబు సమావేశమై తన ప్రతిపాదనకు వారి నుంచి రుణం ఏ మేరకు రాగలదన్నదానిపై చర్చలు జరిపారు. తక్షణం రూ. పాతిక వేల కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా ఈ ప్రయత్నాలు నడుస్తున్నాయి. కేంద్రం లేదా రిజర్వు బ్యాంక్ వద్దకు ప్రతినిధి బృందాలను పంపేటప్పుడు కూడా వారితో ముందుగా సమావేశమై చర్చించి పంపిస్తున్నారు.
శుక్రవారం ఆయనతో జపాన్, టర్కీ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు సమావేశమయ్యాయి. అలాగే ఒక వాణిజ్య బ్యాంకు ప్రతినిధి బృందం, విద్యుత్‌కు సంబంధించి కేంద్రం బృందం వచ్చాయి. పెద్దగా ప్రచారం లేకుండానే ఈ సమావేశాలన్నీ జరిగాయి. జపాన్ ప్రతినిధి బృందం తమకు కేటాయించిన సమయానికి సరిగ్గా పది నిమషాల ముందు వచ్చి కూర్చుంది. వారికి చెప్పిన సమయానికి నిమిషం తేడా లేకుండా చంద్రబాబు ఆ సమావేశంలో కూర్చున్నారు.
అనుకోకుండా బ్యాంక్ ప్రతినిధి బృందం రావడంతో కేంద్ర బృందంతో సమావేశం మాత్రం ఇరవై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తన రోజువారీ ప్రణాళికను కూడా చంద్రబాబు క్రమంగా తీర్చిదిద్దుకొంటున్నారు. తన కోసం వచ్చే సందర్శకులు ఎవరైనా సాయంత్రం ఐదున్నర గంటల తర్వాతే రావాలని ముందుగా చెబుతుండటంతో పగటిపూట ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు సాఫీగా జరిగిపోతున్నాయి.
ఉదయం పది గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు రాత్రి ఎనిమిది గంటలవరకూ అక్కడే ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకుని తిరిగి తన పనిలోకి వెళ్లిపోతున్నారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications