భూమనతో గొడవ: వెంకటరమణ ధర్నా(పిక్చర్స్)
తిరుపతి: పోలింగ్ ముగిసిన తర్వాత కూడా బుధవారం సాయంత్రం తిరుపతిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ తెలుగుదేశం అభ్యర్థి వెంకటరమణ ఆందోళన చేపట్టారు.
తిరుపతి నగరంలోని పూలే విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వెంకటరమణ గురువారం ఉదయం మౌనదీక్షకు దిగారు. తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి దాడి చేశారని నిరసనగా వెంకటరమణ మౌనదీక్ష చేపట్టారు.
ఎన్నికల సందర్భంగా బుధవారం సాయంత్రం వెంకటరమణపై భూమన కరుణాకర్ రెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గొడవ నేపథ్యంలో ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండు గంటల తర్వాత వదిలేశారు. గురువారం ఉదయం తన అనుచరులతో దీక్ష చేసిన వెంకటరమణ ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు.

వెంకటరమణ మౌనదీక్ష
తిరుపతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి తనపై దాడి చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణ ఫూలే విగ్రహం వద్ద మౌనదీక్ష చేశారు.

వెంకటరమణ మౌనదీక్ష
టిడిపి తిరుపతి అభ్యర్థి వెంకటరమణ మౌనదీక్ష సందర్భంగా పార్టీ నాయకులు ఇలా కనిపించారు. వైయస్సార్ కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

వెంకటరమణ మౌన దీక్ష
మౌనదీక్ష చేపట్టిన టిడిపి అభ్యర్థి వెంకటరమణకు సంఘీభావంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలా ఫూలే విగ్రహం వద్ద బైఠాయించారు.

వెంకటరమణ మౌనదీక్ష
మౌనదీక్ష తర్వాత వెంకటరమణ ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications