పరిష్కారమిది: కేబినెట్‌కు జివోఎం 2 సిఫార్సులు!

పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో తలెత్తే సమస్యలన్నిటికీ రాయల ఏర్పాటే పరిష్కారమన్న నిర్ధారణకు ఢిల్లీ పెద్దలు వచ్చారంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో పాటు రాయల తెలంగాణను జివోఎం సిఫార్సు చేయనుందని అంటున్నారు. రాయల తెలంగాణ అయితే అసెంబ్లీలోనూ ముసాయిదా బిల్లుకు సానుకూల అభిప్రాయం వస్తుందని అధిష్టానం అంచనా వేస్తోందట.
దీంతో పది జిల్లాలతో కూడిన తెలంగాణకు ఒకటి, 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణకు మరొకటి రెండు ముసాయిదా బిల్లులు తయారు చేయాలని హోం శాఖకు చెప్పినా, సోమవారం జరగనున్న జివోఎం సమావేశంలో రాయల తెలంగాణ బిల్లుకే ఆమోద ముద్ర వేయవచ్చునంటున్నారు. మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశానికి తెలంగాణతో పాటు దీనిని పంపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
రాయల తెలంగాణ అంశానికి సంబంధించి జివోఎం సభ్యులు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ మధ్య ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ సాగింది. సిడబ్ల్యూసి తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణే కావాలని దామోదర పట్టుబట్టినప్పుడు రాయల తెలంగాణ ఏర్పాటు చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆంటోనీ, జైరాం రమేశ్ వివరించారట.












Click it and Unblock the Notifications