పర్యావరణ పరిరక్షణ కోసం.. ఈ ప్లేట్లను తినేయవచ్చు..
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. అందుకోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలి. అందులో భాగంగా ఓ వ్యక్తి వినూత్న ఆలోచనకు తెరలేపాడు. మనం భోజనం చేశాక ఆ ప్లేట్లను పడేయకుండా.. అవసరం అయితే.. ఆ ప్లేట్లను కూడా తినేసే అవకాశం కల్పించాడు. అవును మీరు విన్నది నిజం. ఇవి ప్రపంచంలోనే ఏకైక తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేట్లుగా కూడా గుర్తింపు పొందాయి. మరి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ఆతను అమలు చేసిన ఆలోచనలు ఎలా ఆవిష్కృతం అయ్యాయో తెలుసుకుందాం రండి.
సౌరశక్తితో ఇంటిని నిర్మించాడు..
కేరళకు చెందిన విజయ్‌కుమార్ బాలకృష్ణన్ మారిషస్‌లో సైన్యం, భీమా, బ్యాకింగ్ తదితర రంగాలలో విజయవంతంగా పని చేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. 2013లో మారిషస్ నుంచి తిరిగి స్వదేశానికి వచ్చి వంద శాతం సౌరశక్తితో ఇంటిని నిర్మించాడు. అలా అతను ఇల్లుని కూడా పర్యావరణ హితంగానే నిర్మించుకున్నాడు. వారి ఇంట్లో కూడా వ్యర్థపదార్థాల నుంచి ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను ఉపయోగిస్తారు. బాలకృష్ణన్ మారిషస్ నుంచి కేరళలోని ఎర్నాకులంకి వచ్చిన తర్వాత పర్యావరణపై మరింతగా దృష్టిసారించారు. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రహించారు. నిజానికి, అందులో భాగంగానే ఎంతోమంది ఎన్నో రకాల పర్యావరణ హితకరమైన ప్లేట్లను తీసుకొచ్చారు. చెట్ల నారతో చేసేవి, ఆకులతోటి, లేదా కాగితాలు తదితర విభిన్నమైనవి వచ్చాయి. అయితే, వాటన్నింటినీ తలదన్నేలా వినూత్నంగా బయోడిగ్రేడబుల్ ప్లేట్లు ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

కోచ్చిలో సైన్సు ఎగ్జిబిషన్..
అయితే, గతంలో దుబాయ్‌లో ఓ పార్టీకి హాజరయ్యారు బాలకృష్ణన్. అక్కడ అతనికి తినదగిన బయోడిగ్రేడబుల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణతో ఆశ్చర్యపోయిన ఆయన ఒక పోలిష్ కంపెనీ అలాంటి ప్లేట్‌లను తయారు చేసినట్లు తెలుసుకున్నాడు. దీన్నే మన దేశంలో డెవలప్ చేసేందుకు పోలిష్ కంపెనీని సంప్రదించాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. అయినా నిరాశ చెందక బాలకృష్ణనే స్వయంగా వరి ఊక, వరిపొట్టు, మొక్కజొన్న వ్యర్థాలు తదితర వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధనలు చేయడం ప్రారంభించాడు. ఈ తపనే కొచ్చిలోని ఒక సైన్సు ఎగ్జిబిషన్‌కు దారితీసింది.
ఎన్నో సమస్యలు..
అయితే, బాలకృష్ణన్ పరిశోధనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ముందుగా వారి పరిశోధనలకు నిధుల సమస్య ఎదురైంది. బాలకృష్ణన్ ప్రాజెక్టులో రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్లేట్ల తయారీకి యంత్రాలు లేకపోవడంతో అదనంగా మరో పదిలక్షలు అవసరమయ్యింది. అంకితభావం, నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఎప్పుడో ఒకప్పుడు ప్రతిఫలం కనిపిస్తుందనేది బాలకృష్ణన్ జీవితంలో నిరూపించింది. 2018లో గోధుమ ఊకతో తయారు చేసిన ప్లేట్‌లు ల్యాబ్‌లో ఆవిర్భవించాయి. వీటిని చూసిన శాస్త్రవేత్తలు భారీ మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు అవసరమైన డాక్యుమెంట్లు, లైసెన్సులు సంపాదించారు బాలకృష్ణన్. అలా 2021లో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చాయి.
జి 20 సమావేశంలో కూడా..
అలా వివాహాల్లో ఈవెంట్లలో ఈ ప్లేట్ల హావా కొనసాగింది. అలాగే జీ20 సమావేశంలో కూడా దాదాపుగా 3వేల ప్లేట్ల ఆర్డర్ వచ్చిందని చెప్పుకోచ్చారు బాలకృష్ణన్. ఈ ప్లేట్లు అన్ని రకాలుగా ఉపయోగపడేలా రూపొందిచినవి. వీటిని భోజనం చేసి పడేయక్కర్లేదు. వాటిని తినొచ్చు. లేదా మళ్లీ వాడుకోవచ్చు. ఆక్వాఫుడ్‌గా కూడా వాటిని ఉపయోగించొచ్చు. అలాగే పర్యావరణంలో కూడా ఈ ప్లేట్లు ఈజీగా డికంపోజ్ అయ్యే విధంగా తయారుచేశారు. ఈ ఆవిష్కరణకు గానూ బాలకృష్ణన్‌కు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కాయి.

వీటి ధరలు చూద్దాం..
ఇక తూషన్ ఉత్పత్తుల్లో పెద్ద ప్లేట్ల ధర ఒక్కొక్కటి పది రూపాయలు కాగా, చిన్నవి ఒక్కో ముక్క ఐదు రూపాయలు. అదనంగా, బియ్యం పిండితో తయారు చేసిన 100 స్ట్రాస్‌ల సెట్ 150 రూపాయలు. చాలా ఆటుపోట్ల మధ్య ఈ బ్రాండ్ తన ఉనికిని చాటుకుంటూ ముందుకు వెళ్తోందని, ఇక మరిన్ని లాభాలు అందుకునేలా వ్యాపారాన్నిబాగా ముందకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేయడమే తన లక్ష్యం అని బాలకృష్ణన్ సగర్వంగా చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications