మొద్దు శీను, బాబుకు రద్దు శీను!

కాంగ్రెస్ పార్టీ మొద్దు శీను విషయంలో అలర్ట్ గా ఉండగా తెలుగుదేశం పార్టీ మాత్రం మొద్దు నిద్రలో ఉండిపోయింది. ఒక తెలుగుదేశం కార్యకర్తే అయిన ఓం ప్రకాషే మొద్దు శీనును హత్య చేశాడన్న విషయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి పెట్టగలిగింది.
చంద్రబాబు నాయుడు నాయకత్వం లోని తెలుగుదేశం పార్టీ వరుస వైఫల్యాలను చవిచూస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక పవనాలు వీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అధికారాన్ని అందిపుచ్చుకోడానికి అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుగుదేశం పార్టీ సీరియస్ గా ఆలోచించకపోవడం గమనార్హం. ఎంతవరకూ నందమూరి వారసుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం వంటి అంశాలపై దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ పరిస్ధితి ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications