వైఎస్- అప్పుడు, ఇప్పుడు!

చంద్రబాబు నాయుడు ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బుతో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని, ప్రచారాలకు డబ్బు ఖర్చు చేయనని పాదయాత్రలో ప్రజలకు చెప్పుకున్న వైఎస్ ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? చంద్రబాబు నాయుడి కంటే విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారు. వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను తీసుకున్న ఒక దినపత్రిక అదే రోజు నుంచి ఆయన మీద, ఆయన మనస్తత్వం మీద వ్యతిరేక వార్తాకథన సిరీస్ ను ప్రారంభించడం విశేషం.
స్వయంగా ఒక భారీ దినపత్రిక (వైట్ ఎలిఫెంట్) ను నడుపుకుంటున్న వైఎస్ పనిలో పనిగా ప్రజాధనంలో సింహ భాగాన్ని తన పత్రిక కోసం తీసుకోవడం విశేషం. కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని ఇటువంటి ప్రకటల ద్వారా ఖర్చు చేయనున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications