సాక్షి, ఈనాడు మధ్య ప్రత్యక్ష పోరు?

ఇటీవల సాక్షి పత్రిక రేటును రెండున్నరకు పెంచడం, పేజీలు తగ్గించడం వల్ల ఆ పత్రిక సర్క్యులేషన్ గణనీయంగా తగ్గుతున్నట్టు న్యూస్ పేపర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి బాకా ఊదినా రెండు రూపాయలే కాబట్టి సాక్షి లూజ్ సేల్స్ బాగా ఉండేవి. గత తొమ్మిది నెలలుగా ఈనాడు కంటే దాదాపు మూడు లక్షల కాపీలు అధికంగా అమ్ముకున్న సాక్షి ఇప్పుడు చిన్నబోయింది. ఎంతవరకు రామోజీరావు, చంద్రబాబు నాయుడుల మీద ద్వేషంతో వార్తలు రాస్తుండడంతో ఒక సామాజిక వర్గానికి చెందినవారు సాక్షిని చదవడం మానేశారు. రాజశేఖరరెడ్డి మీద అక్కసుతో వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను మరో సామాజిక వర్గంలోని అత్యధికులు తెప్పించుకోవడం మానేసినట్టు సమాచారం. ఎక్కడి కెళుతోంది? ఈ రాష్ట్రం ఏమైపోతోంది.












Click it and Unblock the Notifications