వంగా గీతతో చిరు కోలాటం

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి తన పార్టీ నాయకురాలు వంగా గీతతో కలిసి కోలాటం ఆడారు. తిరుపతి వీధుల్లో వీరిద్దరి కోలాటం చూసి ప్రజలు ముక్కు మీద వేలేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)ని ప్రక్షాళనం చేయాలంటూ తిరుమల మెట్లు ఎక్కడానికి సిద్ధపడిన చిరంజీవి శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాల సమర్పించి ఆ తర్వాత వంగా గీతతో కోలాటం ఆడాడు. ఇంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో గుర్రం స్వారీ చేసి తన హీరోయిజాన్ని ప్రదర్శించిన చిరంజీవి ఈసారి కూడా తన హీరోయిజాన్ని ప్రదర్సించాడని అంటున్నారు. కొంత దూరం పరుగులు కూడా తీశారు. అయితే తిరుమల మెట్లు ఎక్కడానికి మాత్రం చెమటలు కక్కారు. అలసిపోయి పలు చోట్ల ఆగిపోయారు.

టిటిడి ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం సాగుతుందని చిరంజీవి చెప్పారు. ఇటీవలి కాలంలో టిటిడిలో వివాదాలు, కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయని దీనిని సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, వెంటనే సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+