మంత్రివర్గ విస్తరణ తర్వాత రోశయ్య విశ్వరూపం

ముఖ్యమైన ఫైళ్ల విషయంలో కూడా రోశయ్య దూకుడుగా వెళ్తున్నట్టు సమాచారం. హైకమాండ్ కు నెలవారీ కప్పం చెల్లించుకోవాలి కాబట్టి ఆయన దూకుడుగా వ్యవహరించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఈ విషయంలో ఆయన కెవిపి రామచంద్రరావును మొదట విశ్వాసంలోకి తీసుకున్నప్పటికీ ఇప్పుడు జగన్ వ్యవహారం కారణంగా ఆయన కెవిపి ని పూర్తిగా విశ్వసిస్తున్నట్టు కన్పించడం లేదు. రోశయ్య కొత్త కోటరీని తయారు చేసుకున్నట్టు విన్పిస్తోంది. ఆ కోటరీలో ఎవరెవరు ఉన్నారన్నది బయటపడడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చు.












Click it and Unblock the Notifications