జోష్‌లో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి

దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకాలు రాయడంలో నిమగ్నమైపోయారు. ఆయన అంచనాలు నిజమవుతుండడంతో ఆయన జోష్‌లో ఉన్నారని అంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 150 నుంచి 160 వరకు శానససభా స్థానాలను గెలుచుకుంటుందని ఓ అంచనా వేశారు. ఆయన చెప్పిందే నిజమైంది. ఆ తర్వాత తెలంగాణపై ఆయన ఆ పుస్తక రాజాన్ని వెలువరించారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయడం మంచిదంటూ ఆయన తన అభిప్రాయాన్ని ఆ పుస్తకంలో చెప్పారు. ఇప్పుడు అదే జరుగబోతుందనే సంతోషంతో ఆయన ఉన్నారట. ఇప్పుడు ఆయన మరేం అంచనాలతో పుస్తకాలు రాయబోతున్నారో చూడాలి.












Click it and Unblock the Notifications