జైలులో నిమ్మగడ్డతో అల్లు అరవింద్ భేటీ

నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే కలిశానని ఆయన చెప్పారు. ఆయనతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్సి చాముండేశ్వరీనాథ్ కూడా నిమ్మగడ్డను కలిశారు. మాటీవీలో నిమ్మగడ్డ ప్రసాద్, నాగార్జున, చిరంజీవిలకు 80 శాతం వాటా ఉంది. ఇందులో 30 శాతం వాటాను సోనీ పిక్చర్స్ టెలివిజన్ ఏప్రిల్‌లో కొనుగోలు చేసింది. మాటీవీకి నిమ్మగడ్డ ప్రసాద్ చైర్మన్‌గా ఉన్నారు.
మా టీవీ వ్యవహారాల్లోనే అల్లు అరవింద్ నిమ్మగడ్డతో కలిసి ఉండవచ్చునని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలు మార్లు సినీ హీరో నాగార్జున కూడా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు.
ఇదిలావుంటే, చంచల్‌గుడా జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కలిశారు.












Click it and Unblock the Notifications