వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డికి ట్విస్టు ఇచ్చిన ఆజాద్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
మంత్రి వర్గ విస్తరణ విషయంలో ఓ ట్విస్టు ఇచ్చి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కొద్దిగా కలవరానికి గురి చేశారు. విస్తరణపై ఆదివారమంతా డ్రామా నడిచింది. సీఎం కిరణ్ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తన విశ్రాంతి గదిలో ఏకాంతంగా గడిపారు. రోజు మొత్తం మీద ఆయన ఆశావహులతో గడిపిన సమయం చాలా స్వల్పం. దీంతో, మంత్రివర్గ విస్తరణ కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదని, సీమాంధ్రలోనూ మార్పులూ, చేర్పులూ ఉంటాయని పలువురు నాయకులు చెప్పుకొచ్చారు. కేవలం తెలంగాణ కోసమే అయితే ఇంత సుదీర్ఘంగా సమాలోచనలు చేయాల్సిన అవసరం సీఎంకు లేదని వారు అనుకుంటూ వచ్చారు.

ముఖ్యమంత్రి తన విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయారు. కాగా, ఉదయం నుంచి ముఖ్యమంత్రి ఏపీ భవన్ దాటకపోవటంతో అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ స్థితిలో సాయంత్రం 5 గంటలకు మీడియా ప్రతినిధులు ఆజాద్‌ను కలిసి రాష్ట్ర కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా.. "ఇంత వరకూ ఎలాంటి వార్తా లేదు'' అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. సాయంత్రం 6.10 గంటలకు సోనియాను కలిసేందుకు సీఎం 10 జన్‌పథ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఆజాద్, అహ్మద్ పటేల్ ఉన్నారు. గంటపాటు జరిగిన సమావేశం అనంతరం సీఎం నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా కిరణ్ సమాధానం ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజుల్లో అంతా ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. దీంతో కేబినెట్ విస్తరణకు సంబంధించిన డ్రామాకు తెరపడింది.

English summary
Congress AP affairs incharge Ghulam Nabi Azad gave twist Cabinet expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X