వైఎస్ హడావుడి, కిరణ్ ఆచితూచి: ఎవరు బెట్టర్?

అయితే ఆ హడావుడి కంటే ఇలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమే బెట్టర్ అంటున్నారట. వైయస్ హడావుడి నిర్ణయాల వల్ల పలువురు ఐఏఎస్ అధికారులు జైళ్లకు వెళ్లారని, ఆయన పాలించే సమయంలో అధికారులకు ఏదైనా అంశంపై అధ్యయనం చేయడానికి కూడా సమయం దొరికేది కాదట! ఏదైనా ఫైల్ చేతికివ్వగానే సాయంత్రం లేదా రేపటిలోగా ఫైల్ ఇవ్వాలని అధికారులను అదేశించేవారట!
ఒత్తిడి వల్ల వారు హడావుడిగా అందుకు సంబంధించిన అంశంపై అధ్యయనం చేయకుండానే నిర్ణయం తీసుకునే వారట. అందుకు ఇప్పుడు పలువురు అధికారులు జైళ్లకు వెళ్లడమే నిదర్శనమని చెబుతున్నారు. అప్పుడు హడావుడిగా నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే తప్పులు జరిగి ఉండేవి కావని, అప్పుడు ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైయస్ పాలన హడావుడిగా కనిపించగా కిరణ్ పాలన అందుకు భిన్నంగా కనిపిస్తోందని అంటున్నారు.
కిరణ్ పాలనలో ఏదైనా విషయం అధికారుల వద్దకు వస్తే వారికి అధ్యయనం చేసేందుకు సమయం దొరుకుతుందట. ఎవరూ ఒత్తిడి చేయడం లేదట. అందుకే వారు నిర్ణయం తీసుకునే ముందు అన్ని పరీశీలించి తీసుకుంటున్నారట. వైయస్ నిర్ణయాలు అప్పటికి బాగానే ఉన్నా అధికారులు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కు పోయారని, కిరణ్ పాలన స్లోగా కనిపించినా ఇబ్బందులు లేకుండా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.
అయితే దీంతో మరికొందరు విభేదిస్తున్నారు. అలాంటిదేమీ లేదని, వైయస్ పాలనలో ఒత్తిళ్లు అనేది అవాస్తవమని చెబుతున్నారు. అప్పుడు హడావుడి కనిపించినా ఇప్పుడు స్లోగా ఉంటున్నా అధికారులపై మాత్రం ఒత్తిళ్లు అనేది సరికాదంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలే అజెండాగా తీసుకునే వారని, ఎవరి లబ్ధి కోసమే ఒత్తిళ్లు అనేది మాత్రం తప్పుడు ప్రచారం అంటున్నారు.












Click it and Unblock the Notifications