రాష్ట్రపతితో కిరణ్ అర్ధరాత్రి చర్చల మర్మమేంటి

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సోమవారం రాత్రి అర్ధరాత్రి పూట దాదాపు గంటన్నర పాటు రహస్యంగా చర్చలు జరిపారన్న ప్రచారం ఇప్పుడు కాంగ్రెసు పార్టీతో పాటు మిగిలిన పార్టీల్లోనూ చర్చకు దారి తీసింది. మన రాష్ట్రానికి చెందవలసిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించడాన్ని ఆపించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం న్యూఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి గ్యాస్ తమకే కేటాయించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేసేందుకు ప్రధానంగా వెళ్లారు.

సోమవారం ఢిల్లీ వెళ్లిన కిరణ్‌కు సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రధాని అపాయింటుమెంట్ దొరికింది. దీంతో కిరణ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత గ్యాస్ సమస్యను వివరించేందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు ఆంటోనీ, వీరప్ప మొయిలీలను కలిశారు.

ప్రధానిని కలిసి గ్యాస్‌ను రాష్ట్రానికే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారట. తన వెంట సెక్యూరిటీ అధికారులను కూడా తీసుకు వెళ్లకుండానే కిరణ్ వెళ్లారట. ప్రణబ్ దాదాతో దాదాపు గంటన్నర పాటు ఆయన చర్చలు జరిపారని సమాచారం. అర్ధరాత్రి పూట భద్రతా అధికారులు కూడా లేకుండా కిరణ్ ఒక్కరే రహస్యంగా వెళ్లి చర్చలు జరపడం వెనుక కారణాలేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

ప్రణబ్‌తో కిరణ్ రహస్య చర్చలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెసులో కూడా వీటిపై జోరుగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రణబ్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిన కిరణ్ అప్పుడే ఆయన అపాయింటుమెంటు కోరారని తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి ప్రణబ్‌తో చర్చల మర్మమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+