ములాయం సింగ్‌కు రెండో భార్య కష్టాలు

ఆ డిమాండ్‌తో అజంగఢ్ నియోజకవర్గ పరిధిలోని 24 మందికిపైగా గ్రామ పంచాయతీ సర్పంచుల నేతృత్వంలో 200 మంది ఎస్పీ కార్యకర్తలు లక్నోలోని పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
అజంగఢ్‌లో పార్టీ టికెట్ ప్రతీక్ యాదవ్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా సత్వర అభివృద్ధికిగాను ప్రతీక్‌ను అజంగఢ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దింపాలని కోరుతున్నట్లు భగవాన్ గుప్తా అనే సర్పంచ్ చెప్పారు.
వాస్తవానికి అజంగఢ్ స్థానం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలరాం యాదవ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. అజంగఢ్ స్థానం విషయంలో బలరాం అభ్యర్థితాన్ని మార్చే అవకాశం లేదని ఎస్పీ ప్రతినిధి రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడంతో లోకసభ స్థానాలకు పోటీ పెరిగింది.












Click it and Unblock the Notifications