ఉప ఎన్నికల బరిలో రోజా, కాపు స్థానంలో?

దీంతో రాయదుర్గ నుండి ఆ పార్టీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ రోజాను బరిలోకి దింపేందుకు పార్టీ యోచిస్తుందని తెలుస్తోంది. అక్కడి నుండి రోజాను బరిలోకి దింపే విషయమై పార్టీలో అందరూ అంగీకరించారని తెలుస్తోంది. రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ మెంబర్. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో పోటీ చేసి మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు. ఆమె జగన్ పార్టీలో చేరాక 2014 నగరి అభ్యర్థిగా ఈమె అవుతుందని అందరూ భావించారు. అయితే కాపు పోటీకి విముఖత చూపడంతో అక్కడ రోజానే సరైన అభ్యర్థి అని పార్టీ నేతలు భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications