సమైక్య 'విభజన': అశోక్ బాబు టార్గెట్ వైయస్ జగన్?

Ashok Babu blames YS Jagan indirectly?
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబుకు మింగుడు పడడం లేదంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తనకు వైయస్ జగన్ చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుండడమే అందుకు కారణమని అంటున్నారు. అందుకే వైయస్ జగన్‌పై అశోక్ బాబు పరోక్ష విమర్శలు చేస్తున్నారు. జగన్‌ను విభజనవాదిగా చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీఎన్జీవోను చీల్చేందుకు కొంతమంది విభజనవాదులు కుట్ర పన్నుతున్నారని అశోక్ బాబు పరోక్షంగా జగన్‌ను విమర్శించారు.. బుధవారం శ్రీకాకుళం ఎన్జీవో హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ద్వారా ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎవ్వరైనా ఉద్యమం ఆగబోదని ఆయన అన్నారు.

ఏపీఎన్జీవోల ఐక్యత, పోరాటం రాజకీయ పక్షాల్లో దడ పుట్టించిందన్నారు. సమైక్య ఉద్యమాన్ని 85 శాతం విజయవంతం చేశామని, మిగిలిన 15 శాతం రాజకీయ పక్షాలు ఉద్యమంలో భాగస్వాములు కాలేకపోవడంతో విజయవంతం చేయలేకపోయామని అన్నారు.

అశోక్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయం కల్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న అశోక్ బాబును దెబ్బ తీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

అశోక్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన అఖిల పక్ష సమావేశాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిష్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+