ఏదో దాగి ఉంది - కెవిపి చక్రం వెనుక!?

అయితే ఎప్పుడు మౌనంగా ఉండి తెర వెనుక పనులు చక్కబెట్టే కెవిపి ఇలా తెర పైకి వచ్చి చక్రం తిప్పడం వెనుక ఏముందనే గుసగుసలు కాంగ్రెసు పార్టీలోనే వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను దగ్గరుండి పెద్దల దగ్గరకు తీసుకెళ్లడంతో పాటు అందరి వద్దా ఆయనే ప్రధాన వక్తగా మారి సమైక్యాంధ్ర గళం విప్పుతున్నారట. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తోనూ సమావేశంలో ఆయన దాదాపు పది నిమిషాలు మాట్లాడారు.
ప్రధాని భేటీతో పాటు ఇతర పెద్దల నేతల భేటీలోనూ ఆయన ప్రధానంగా మాట్లాడారట. కెవిపి కావాలనే సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్నారని, దీని వెనుక ఏదో మర్మం దాగుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం ఇప్పటికే తీసుకుందని, ఇప్పుడు పార్టీ పెద్దలతో సమావేశాలు అనవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ సీమాంధ్ర నేతలు కలవడం, వారిని కెవిపి లీడ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications