జగన్ ఇలాకా పులివెందులలో నారా లోకేష్ పాగా?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి వారసుడిగా రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలని నారా లోకేష్ ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇప్పటికిప్పుడు పార్టీ పదవిని చేపడితే స్వపక్షం నుంచే కాకుండా, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన మరో మార్గంలో పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
వివిధ జిల్లాల్లో జరిగే పార్టీ నేతల వివాహాది శుభకార్యాలకు, స్వచ్చంధ సంస్థల కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ నేతల్లో తన పట్టును పెంచుకుంటున్నారు. అదేసమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి కంచుకోట ఉంటూ వస్తున్న పులివెందులలో ఓ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నారు.
నారా లోకేష్ పులివెందుల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొని పార్టీ నేతలతో కలిసిపోవాలని భావిస్తున్నారు. నారా లోకేష్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications