మోడీ సభ: చిరు అల్లుడు భరద్వాజ్‌కు షాక్

అయితే, శిరీష్ భరద్వాజ్‌కు హైదరాబాద్ సభలో ప్రాధాన్యం లభించకపోవడానికి దానికి ఏ మాత్రం సంబంధం లేదు. రాష్ట్రానికి చెందిన కార్యకర్తలే శిరీష్ భరద్వాజ్ పట్ల అక్కసుతో ఉన్నారట. రాష్ట్ర పార్టీతో గానీ, తమతో గానీ ఏ మాత్రం సంబంధం లేకుండా ఆయన నేరుగా మోడీ వద్ద తేలడం వారిని అసంతృప్తికి గురిచేసినట్లు చెబుతున్నారు.
నరేంద్ర మోడీ చిత్రంతో కలిసి శిరీష్ భరద్వాజ్ చిత్రం ఉన్న హోర్డింగులో హైదరాబాదులో కొన్ని చోట్ల దర్శనమిచ్చాయి. దానివల్ల ఆయన మోడీ సభలో ప్రాధాన్యం లభిస్తుందని భావించారు. కానీ రాష్ట్ర నాయకులు శిరీష్ భరద్వాజ్‌ను పట్టించుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
శిరీష్ భరద్వాజ్ పార్టీకి ఉపయోగడేట్లు కూడా లేరనే భావన పెరిగినట్లు చెబుతున్నారు. చిరంజీవిపై శిరీష్ విమర్శలు చేస్తే వాడుకుందామని రాష్ట్ర బిజెపి నాయకులు అనుకున్నారట. అయితే, దానికి ఆయన సిద్ధపడకపోవడంతో కూడా అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications