తెలంగాణ తీర్మానం కిరణ్ రెడ్డికి పరీక్ష

పార్టీలకు అతీతంగా కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానానికి ఓటేస్తారనే అంచనాలు సాగుతున్నాయి. తీర్మానం వీగిపోతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నైతికపరమైన చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
శానససభలో తీర్మానం పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తే వీగిపోతుందనే కారణం చెప్పి ముఖ్యమంత్రి అందుకు నిరాకరించారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి.
తాను తెలంగాణకు వ్యతిరేకంగా లేనని చెప్పిన చంద్రబాబు మాటలు తీర్మానం విషయంలో అబద్ధంగా తేలే ప్రమాదం ఉంది. సీమాంధ్ర శానససభ్యులు తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు చేస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. అంతే కాకుండా, చంద్రబాబు రాజకీయ నైతికతపై కూడా దెబ్బ పడే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం నెగ్గాల్సిన అవసరం లేదు. శాసనసభ అభిప్రాయం వ్యక్తం చేస్తే చాలు. తెలంగాణపై తీర్మానం విషయంలో పార్టీలు విప్ జారీ చేసే అవకాశాలు కూడా లేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications