అరుణాచలం స్పీడ్‌కు జగన్ శిబిరం అదిరిందా?

ఈ కేసును పరిశీలించి నిర్ణయాలు తీసుకునేందుకు అరుణాచలానికి చాలా సమయమే పడుతుందని అనుకున్నారు. కానీ ఇలా వచ్చి ఆలా రెండుమూడు రోజులకే జగన్ అక్రమాస్తుల కేసులో అదనపు చార్జిషీటు దాఖలు చేశారు.ఈ స్పీడ్‌కు వైయస్ జగన్ శిబిరంలో కలకలం ప్రారంభమైనట్లు చెబుతున్నారు.
సిబిఐ జెడి అరుణాచలం దూకుడు వల్ల లాభం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. అరుణాచలం జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తును త్వరగా ముగిస్తే వైయస్ జగన్ చంచల్ గూడ జైలు నుంచి బెయిలుపై త్వరగా వచ్చేసే అవకాశాలుంటాయని అంటున్నారు. దానివల్ల పార్టీని ఎన్నికల దిశగా మరింత సమర్థంగా నడిపించవచ్చునని భావిస్తున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముగించి, చార్జిషీట్లు దాఖలు చేయడానికి ఇంకో మూడు, నాలుగు నెలలైనా పట్టవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఎన్నికల లోపు జగన్ జైలు నుంచి బయటకు వస్తాడా, లేదా చెప్పలేని పరిస్థితే ఉంది.












Click it and Unblock the Notifications