ప్యాంట్‌కు నో, లుంగీతో బాబు: భార్యతో కలిసి యాగం
హైదరాబాద్: లోక కల్యాణార్థం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన 'అతిరుద్ర సహిత అయుత చండీ మహాయాగం' సోమవారం వైభవంగా జరిగిన మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి హాజరై, పూజా కార్యక్రమాల్లో పాల్గొని, పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
అదనపు డిఐజి వెంకటేశ్వరరావు, డీఐజీ యోగానంద్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్, బిజెపి నేత ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్, నిర్వాహకులు ఆర్‌వివి కృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు.
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద పర్యవేక్షణలో యనమండ్ర వేణుగోపాల శాస్త్రి నేతృత్వంలో 500 మంది రుత్విక్కులు 13 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించారు. ప్యాంట్ ధరించి యాగశాలకు అనుమతి లేకపోవడంతో చంద్రబాబు లుంగీ ధరించి ధరించి వెళ్లారు.

చంద్రబాబు దంపతులు..
అతిరుద్ర సహిత ఆయుత చండీ మహాయాగంలో సతీమణి భువనేశ్వరితో కలిసి తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు

ప్యాంట్‌పై అనుమతించకపోవడంతో...
ప్యాంట్‌పై యాగశాలకు అనుతించకపోవడంతో చంద్రబాబు నాయుడు లుంగీ కట్టుకుని యాగశాలకు వెళ్లారు.

ఆశీర్వాదం తీసుకుంటున్న బాబు దంపతులు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి పరిపూర్ణానంద ఆశీస్సులు తీసుకున్నారు.

లోకకళ్యాణం కోసం..
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన అతిరుద్ర సహిత ఆయన చండీయాగం నిర్విఘ్నంగా పూర్తయినందుకు ఆనందంగా ఉందని స్వామి పరిపూర్ణానంద అన్నారు.












Click it and Unblock the Notifications