కెసిఆర్ డ్రీమ్ టీమ్: తొలి సిఎస్ చందనాఖాన్

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అవుతాననే ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు ఇప్పటికే తన మంత్రివర్గంలో ఉండేవారి జాబితాను రూపొందించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రిపదవుల కోసం ఆయనపై తీవ్రంగా ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.

కెసిఆర్ మంత్రి వర్గ జాబితాలో ఉన్నవారు - సముద్రాల వేణుగోపాలచారి, జోగు రామన్న, నల్లాల ఓదెలు, అజ్మీరా రేఖా నాయక్ (ఆదిలాబాద్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ అహ్మద్ (నిజామాబాద్), ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సతీష్ కుమార్ (కరీంనగర్), టి.హరీశ్‌రావు, బాబూమోహన్, పద్మా దేవేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.లక్ష్మారెడ్డి, ఎస్.నిరంజన్‌రెడ్డి (మహబూబ్‌నగర్), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, కె.చంద్రశేఖర్‌రెడ్డి (రంగారెడ్డి), కొండా సురేఖ, సిరికొండ మధుసూదనాచారి, అజ్మీరా చందూలాల్, డాక్టర్ టి.రాజయ్య, సత్యవతి రాథోడ్, దాస్యం వినయ్‌భాస్కర్ (వరంగల్), టి.పద్మారావు, ముఠా గోపాల్ (హైదరాబాద్), నోముల నర్సింహయ్య, జి.జగదీశ్ రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి (నల్గొండ), జలగం వెంకట్రావు (ఖమ్మం), మహమూద్ అలీ, కె.స్వామిగౌడ్ (ఎమ్మెల్సీలు).

KCR fream team in Telangana

సీనియర్ ఐఏఎస్ చందనాఖన్ బుధవారం తెలంగాణ భవన్‌కు వెళ్లారు. తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఐఎఎస్ ఎకె గోయల్‌ను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో చందనాఖన్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి.

సీనియారిటీ జాబితాలోనూ చందనాఖన్ చోటు దక్కించుకున్నారు. దీంతో తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి ఆమెకే దక్కవచ్చునని తెరాస వర్గాలంటున్నాయి. తెలంగాణకు చెందిన వారు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చందనాఖన్ తెలంగాణ భవన్‌లో ప్రత్యక్షం కావడంతో పుకార్లకు ఊపు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+