మంత్రదండమేదీ లేదు: ఎపి రాజధానిపై బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అద్భుతంగా నిర్మిస్తానని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో మాట అంటున్నారు. గాలిలో రాజధానిని నిర్మించడానికి తన వద్ద మంత్రదండమేదీ లేదని వ్యాఖ్యానించారు. అయితే, తప్పకుండా రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13 లక్షల కోట్ల రూపాయలతో 55 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. సైబరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ప్రైవేట్, ప్రబుత్వ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందని ఆయన చెప్పారు.

అయితే తప్పకుండా ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తామని, రాష్ట్రాన్ని ఆనందాంద్రప్రదేశ్‌గా మారుస్తానని, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విజయవాడ, గుంటూర మధ్య రాజధానిని నిర్మించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications