పవన్, జూఎన్టీఆర్‌ల మధ్య తేడా ఉందన్న చిరంజీవి

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శుక్రవారం ఉదయం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా తేడా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనను టిడిపి పక్కన పెట్టినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అదే సమయంలో ఈసారి భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టినట్లు టిడిపి పవన్‌ను పక్కన పెడుతుందా అన్న విషయమై చిరంజీవి స్పందించారు. పవన్‌కు, జూనియర్ ఎన్టీఆర్‌కు చాలా తేడా ఉందని చెప్పారు.

There is no comparision between Jr NTR and Pawan: Chiranjeevi

పవన్ ఇప్పుడు ఓ పార్టీ అధ్యక్షులు అని చెప్పారు. అలాగే తమ కుటుంబ సభ్యులకు ప్రజల పట్ల కృతజ్ఞత ఉందని చెప్పారు. పవన్‌ది, తనది వేర్వేరు దారులు అయినప్పటికీ గమ్యం మాత్రం ఒక్కటేనన్నారు. తమ కుటుంబ సభ్యుల ఆలోచనలు ఎప్పుడు ప్రజల గురించే ఉంటాయని చెప్పారు. తానైనా, పవన్ అయినా ప్రజల గురించి ఆలోచిస్తామన్నారు.

పవన్ కళ్యాణ్‌కు తనకంటూ సొంత ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌లా తన సోదరుడిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టే పరిస్థితి ఉండదన్నారు. తమ దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటేనని, పవన్ ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+