500 నోట్లు తీసిచ్చిన చంద్రబాబు, దీవించిన మహిళ!

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖలో విచిత్ర అనుభవం ఎదురైంది! ఓ ముసలి అవ్వ ఆయనను బిక్షం అడిగింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆయన ఆ తర్వాత జేబులోంచి కొంత డబ్బు తీసి ఆమెకు ఇచ్చారు.

చంద్రబాబు విశాఖ పరిధిలోని రాంనగర్, పందిమిట్ట ప్రాంతాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. నేడు పొద్దున్నే ఆ ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు.. వాకర్లతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల విషయంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు.

మనోరమా థియేటర్ దగ్గర పార్కు శానిటేషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాబు అధికారులను మందలించారు. ఇకపై పరిశుభ్రత విషయంలో అలక్ష్యం వహిస్తే సహించేది లేదని జోనల్ కమిషనర్‌ను హెచ్చరించారు.

 Chandrababu gives money to women in Vishaka

పోర్టు ట్రస్టు, ఎఫ్ఆర్ కంపెనీల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సూచనలు చేశారు. ఆ సమయంలోనే... ఓ ముసలావిడ చంద్రబాబు దగ్గరకు వచ్చింది. తనకు కొంత డబ్బివ్వాలని కోరింది.

ఆమెను సెక్యూరిటీ సిబ్బంది వారించింది. అయినప్పటికీ ఆమె చంద్రబాబు దగ్గరకు వచ్చింది. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు... తన జేబులో చెయ్యి పెట్టి కొన్ని రూ.500 కాగితాలు బయటకు తీశారు. అవి ఎన్నున్నాయో కూడా లెక్కించకుండా ఆమె చేతిలో పెట్టారు. ఆమె చంద్రబాబును దీవిస్తూ అక్కడి నుంచి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+