హైదరాబాదీ బిర్యానీకి ఫేమస్: రియాద్‌లో ఉగ్రవాది హోటల్
హైదరాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని హోటల్‌ను వేలం వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది రియాద్‌లో నడుపుతున్న హోటల్‌పై అందరి దృష్టి పడింది.
రియాద్‌లోని ఆ రెస్టారెంట్ హైదరాబాద్‌కు చెందిన రుచికరమైన బిర్యానీకి పేరు మోసింది. ఆ రెస్టారెంట్ ఇటీవల అరెస్టయిన అబూ సుఫియాన్ అలియాస్ అసదుల్లాకు చెందింది. అతన్ని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అరెస్టు చేసి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి రప్పించింది.

రియాద్‌లోని ఆ హోటల్ అనుమానిత ఉగ్రవాదుల సమావేశానికి కేంద్రంగా ఉంటూ వచ్చిందని అంటున్నారు. దాని పేరు షాయిజ్వాజన్ షాఫ్రాన్ ప్లేవర్. బెంగళూరులో దాడులకు లష్కరే తోయిబా పన్నిన కుట్ర కేసులో ఎన్ఐఎ హైదరాబాద్ అతన్ని ఇటీవల అరెస్టు చేసింది.
అతన్ని ఎన్ఐఎ హైదరాబాదు నుంచి బెంగళూరుకు తరలించి, బుధవారంనాడు కోర్టులో ప్రవేశపెట్టింది. రియాద్‌లోని హోటల్ సంగతి ఇంకా తేలాల్సే ఉంది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications